Pavani Reddy: ప్రియుడితో సహజీవనం చేస్తూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న నటి.. విషయం తెలిసేలోపే బ్రేకప్?

సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో సోషల్ మీడియా వచ్చే వార్తలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్నారు.

అయితే కొందరు సెలబ్రిటీలకు అదే శాపంగా మారుతోందని చెప్పవచ్చు.ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత నెటిజన్స్ సెలబ్రిటీలకు వాళ్లే పెళ్లిళ్లు చేస్తున్నారు వాళ్ళే బ్రేకప్ లు( Breakup ) చేస్తున్నారు, వాళ్లే విడాకులు కూడా ఇచ్చేస్తున్నారు.

అదేంట అనుకుంటున్నారా! అవునండి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ నడుస్తోంది.తరచూ ఒక సెలబ్రిటీ ని టార్గెట్ చేయడం వారికి సంబంధించిన పెళ్లి వార్తలు బ్రేకప్ వార్తలు అంటూ ఇలా లేనిపోని పుకార్లను సృష్టిస్తున్నారు.

కొందరు సెలబ్రిటీ లైఫ్ లో పెళ్లిళ్లు విడాకులు జరగకపోయినా కూడా నెటిజన్స్ వారి పెళ్లిలో విడాకులు జరిపించేస్తున్నారు.తాజాగా ఒక బుల్లితెర నటి విషయంలో కూడా అదే జరిగిందని చెప్పవచ్చు.

Advertisement

ఆమె మరి ఎవరో కాదు నటి పావని రెడ్డి.( Pavani Reddy ) బుల్లితెలపై పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది పావని రెడ్డి.

తమిళ బిగ్ బాస్ సీజన్5 లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.

బిగ్ బాస్ 5 కి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలోనే కొరియోగ్రాఫర్‌ ఆమిర్‌( Choreographer Amir ) పావనిని చూడగానే ప్రేమలో పడ్డాడు.తనకు ప్రపోజ్‌ కూడా చేశాడు, కానీ పావని లైట్‌ తీసుకుంది.ఈ విషయం పక్కన పెడితే బిగ్‌బాస్‌ జోడీ డ్యాన్స్‌ షోలో వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు.

ఆ సమయంలో ఆమిర్‌కు దగ్గరైంది నటి.ఈ షోలో విజేతలుగా నిలిచిన ఈ జంట రియల్‌ లైఫ్‌లోనూ జోడీగా ఉండబోతున్నామని ప్రకటించింది.తునివు సినిమాలో వీరు ప్రేమ పక్షులుగా కూడా నటించారు.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...

ప్రస్తుతం ఈ జంట చెన్నైలో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ నేపథ్యంలోనే కొందరు నెటిజన్స్ పెళ్లి ఎప్పుడు అంటూ పదేపదే ఆ విషయం గురించి ప్రస్తావించడంతో పాటు తాజాగా ఓ అభిమాని మీ ఇద్దరికీ పెళ్లైపోయింది.కానీ ఎందుకు దాచిపెడుతున్నారు, బయటకు చెప్పొచ్చుగా అని అడగగా ఆ కామెంట్ పై వెంటనే స్పందిచిన పావని రెడ్డి. పోయిన నెలలో నేను గర్భవతి అన్నారు.

ఆ తర్వాత మేము బ్రేకప్‌ చెప్పుకున్నామన్నారు.ఇప్పుడేమో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామంటున్నారు.

మరి నెక్స్ట్‌ ఏం కహానీ చెప్పబోతున్నారేంటి? అంటూ తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చింది.

తాజా వార్తలు