Patnam Mahender Reddy : రేపు కాంగ్రెస్ లోకి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.

ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి( Patnam Mahender Reddy ) కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.

ఈ మేరకు రేపు ఆయన తన సతీమణి, వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ సునీతతో కలిసి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈ క్రమంలోనే రేపు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను పట్నం దంపతులు కలవనున్నారు.కాగా ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )ని కలిసిన సంగతి తెలిసిందే.

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!
Advertisement