తెలుగులో 'పఠాన్‌' పాట్లు.. ఇక్కడ మినిమంగానైనా ఓపెనింగ్స్ దక్కేనా?

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌ హీరోగా చాలా కాలం తర్వాత వస్తున్న చిత్రం పఠాన్‌.

ఈయన గత చిత్రం జీరో ఏ స్థాయి లో డిజాస్టర్ గా నిలిచిందో అందరికి తెల్సిందే.

అందుకే కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాత షారుఖ్ ఖాన్‌ పఠాన్ సినిమా ను చేస్తున్నాడు.కమర్షియల్‌ సినిమా లకు కేరాఫ్‌ అడ్రస్ అయిన సిద్దార్థ్ ఆనంద్‌ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందింది.

ఈ మధ్య కాలంలో మన సౌత్‌ సినిమా లు ముఖ్యంగా తెలుగు సినిమా లు ఉత్తర భారతంలో విడుదల అవుతున్నాయి.అక్కడ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

అందుకే ఈ సినిమా ను మన సౌత్‌ లో విడుదల చేయాలని షారుఖ్‌ ఖాన్ ప్లాన్‌ చేశాడు.అందుకే రామ్‌ చరణ్ తో తెలుగు లో ట్రైలర్‌ ను విడుదల చేయడం జరిగింది.

Advertisement

ఇక తమిళం లో తమిళ్ సూపర్ స్టార్‌ విజయ్‌ తో ట్రైలర్ రిలీజ్ చేయించారు.

అక్కడ ఇక్కడ కూడా వీరిద్దరికి ఉన్న క్రేజ్ నేపథ్యం లో పఠాన్ సినిమా కు మినిమం గా రీచ్ దక్కే అవకాశం ఉంది.అయితే సినిమా జనవరి 25వ తారీకన విడుదల కాబోతున్న నేపథ్యం లో వసూళ్లు ఎలా ఉంటాయో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ మధ్య కాలంలో లాల్‌ సింగ్‌ చడ్దా మరియు బ్రహ్మాస్త్ర సినిమా లు తెలుగు లో ఈ మధ్య విడుదల అయ్యాయి.

కానీ ఏ ఒక్కటి కూడా తెలుగు లో డీసెంట్‌ సక్సెస్ ను దక్కించుకోలేదు.మినిమంగా కలెక్షన్స్ ను దక్కించుకోలేక పోయాయి.అయినా కూడా పఠాన్ సినిమా మహా రేంజ్ లో కుమ్మేయడం ఖాయం అన్నట్లుగా మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.

మరి ఆ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకుని కనీసం పది కోట్ల కలెక్షన్స్ తెలుగు బాక్సాఫీస్ వద్ద నమోదు అవుతుందేమో చూడాలి.

ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి
Advertisement

తాజా వార్తలు