ఈ రైల్వే పోలీసుకు సలాం కొట్టాల్సిందే.. ఎందుకో తెలుసా?

రైల్వే స్టేషన్ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.పాదచారుల వంతెనలను కాకుండా రైలు పట్టాల మీది నుండి వెళ్లడం లాంటి ఘటనలు జరుగుతుంటాయి.

అలాగే రన్నింగ్ ట్రెయిన్ నుండి దిగడం వల్ల కూడా తరచూ ప్రమాదాలు జరగడం తెలిసిందే.అలాగే ట్రెయిన్ కదులుతున్న సమయంలో పరుగెత్తు కెళ్లి రైలు ఎక్కేందుకు ప్రయత్నించడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి.

Passenger Fell From Moving Train Saved By Constable In Jhansi Details, Railway P

ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ఎప్పుడూ అవగాహన కల్పిస్తూనే ఉంటారు.పట్టాలు దాటవద్దని, రన్నింగ్ లో ఉన్న రైలు ఎక్కవద్దని అనౌన్స్ చేస్తారు.

అక్కడే ఉండే రైల్వే పోలీసులు, రైల్వే అధికారులు నిత్యం అవగాహన కల్పిస్తూనే ఉంటారు.అయినా చాలా మంది వాటిని పెడచెవిన పెడతారు.

Advertisement

వాళ్లకు నచ్చిందే చేస్తూ పోతారు.దీని వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి.

అలా రైల్వే స్టేషన్ ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎప్పుడూ కాపలా ఉంటారు.అలా ఉన్న ఓ పోలీసు చేసిన సాహస కార్యం ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకుంది.

అతడో రియల్ హీరో అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.రైలులో నుండి పడిపోతున్న ఓ ప్రయాణికుడిని రైల్వే పోలీసు చాకచక్యంగా కాపాడాడు.

తన సామాన్లు తీసుకోవడానికి ప్రయాణికుడు ప్లాట్ ఫాంపై దిగాడు.అంతలోనే రైలు కదిలింది.

కైలాస పర్వతం గురించి ఈ విషయాలు తెలిస్తే .. శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే

ప్రయాణికుడు పరుగెత్తి రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు.రైలు వేగంగా ఉండటంతో బోగీ ఎక్కడం కష్టంగా ఉండటంతో అతడు పట్టుతప్పి కింద పడబోయే సమయంలో రైల్వే పోలీసు అతడిని కాపాడాడు.

Advertisement

ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.

తాజా వార్తలు