మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణకు పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్

40ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని.దేశంలోనే ‍ఒక సీనియర్ నాయకుడు, మచ్చలేని వ్యక్తి నడుపుతున్న పార్టీని వంద కోట్లు పెట్టి కొంటానంటావా.

నీ అహంకారాన్ని తగ్గించుకో.ఇదీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణకు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్.

అన్నీ తెగించే ధర్మవరం వచ్చాను.నీ ఉడుత ఊపులకు భయపడనంటూ వార్నింగ్ ఇచ్చారు.

రెండు రోజుల క్రితం పరిటాల కుటుంబం పైన వరదాపురం సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యల మీద శ్రీరామ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ధర్మవరంలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ముందు ధర్మవరంలోకి రావాలన్నా.

Advertisement

టీడీపీ గురించి మాట్లాడాలన్నా సూరి క్షమాపణ చెప్పి రావాలన్నారు.కష్టకాలంలో నమ్ముకున్న జనాన్ని, కార్యకర్తలను నడిరోడ్డులో వదిలేసి వెళ్లిపోయి.

ఇప్పుడు వచ్చి షోలు చేస్తున్నావంటూ ఫైర్ అయ్యారు.నిన్ను నమ్ముకుని ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేసిన వారంతా తీవ్ర కష్టాల్లో ఉంటే.

ఆ రోజు అధినేత చంద్రబాబు ఆదేశాలతో నేను ధర్మవరంలో అడుగు పెట్టానన్నారు.ఆ రోజు నేను టీడీపీ అని చెప్పాలంటే భయపడే పరిస్థితి.

జెండా బయటపెట్టాలంటే వణికి పోయే పరిస్థితి ఉండేదన్నారు.దీనికంతటికీ కారణం నువ్వు కాదా అంటూ నిలదీశారు.

ఈ డ్రింక్స్ తీసుకుంటే..మీ లంగ్స్ క్లీన్ అవ్వ‌డం ఖాయం!

ఆరోజు నుంచి పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని ఒప్పించి.వారిలో ధైర్యం నింపి నిలబెట్టానని.

Advertisement

ఈ రోజు వాడవాడలా పార్టీని జెండా రెపరెపలాడిస్తున్నారన్నారు.ఎక్కడో కోటల్లో ఉన్న ఎమ్మెల్యేను నిత్యం జనం మధ్య తిప్పించే పరిస్థితికి తీసుకొచ్చామన్నారు.

మరీ ముఖ్యంగా ఆరోజు నువ్వు వెళ్లిపోయిన విషయం కంటే.ఎమ్మెల్యేకి నీ స్వార్థం కోసం కప్పం కట్టిన విషయం కార్యకర్తల్ని చాలా బాధించిందన్నారు.

స్వయంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పిన విషయం మర్చిపోయావా అంటూ ప్రశ్నించారు.నీ వలనే చాలా మంది పార్టీకి దూరమయ్యారని.

ఆ రోజు నీకు పార్టీపై ప్రేమ ఉంటే ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు.గతంలో మాజీ మంత్రి శంకర్ నారాయణ కానీ, జనసేన నేత మధుసూదన్ రెడ్డి కానీ పార్టీ విడిచిపెట్టి పోయింది నీవలన కాదా అంటూ నిలదీశారు.

మేము నీకు వ్యతిరేకంగా పనిచేశామని.అందుకే 2009, 2019లో ఓడిపోయానని చెబుతున్నావ్.

మరి 2014లో ఎలా గెలిచావ్ అని ప్రశ్నించారు.గెలిస్తే నీ క్రెడిట్.

లేదంటే ఎదుటి వాళ్ల తప్పా అని ప్రశ్నించారు.సోషియల్ మీడియాలో నీ మునుషులు చేస్తున్న పోస్టులు ఒకసారి చూడాలన్నారు.

తెలంగాణలో డబ్బులు ఉన్న వారికి రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చారని.ఇక్కడ కూడా అంతే అంటూ పోస్టులు పెడుతున్నారని.

గతంలో కూడా వంద కోట్లు పెట్టి పార్టీని కొంటానన్నారు.తెలుగుదేశాన్ని తగ్గించి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

వంద కోట్లు తీసుకొని వస్తే.నిన్ను పదిసార్లు కొంటానన్నారు.

పార్టీలోకి రావాలనుకుంటే.ధర్మవరం ప్రజలకు, కార్యకర్తలకు, చంద్రబాబు, లోకేష్ లకు క్షమాపణ చెప్పి రావాలని సూచించారు.

పార్టీలోకి వచ్చి కష్టపడితే ఏదో ఒక పదవి ఇస్తామన్నారు.మరోవైపు ధర్మవరం చెరువుకు నీరు తెప్పించేందుకు 3కోట్ల రూపాయలు బిల్లులు చేసుకున్నారని ఆరోపించావు.

అసలు ఏ కాల్వ ఎప్పుడు చేశావ్.ఎవరు బిల్లులు చేసుకున్నారో స్పష్టంగా చెప్పాలన్నారు.

నీ అసమర్థత, షోలు చేయడం వలన ఆ రోజు ఇంకా చాలా చెరువులకు నీరు అందలేదన్నారు.మరోవైపు రోడ్డు పనుల విషయంలో మేము ఎలా చేశాము.

కార్యకర్తలకు ఎందుకివ్వలేదని మాట్లాడుతున్నావ్.మొన్న ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడిన మాటలు నువ్వు చెబుతున్నావన్నారు.

మేము చేసిన పనులకు కోట్ల రూపాయల మేర బిల్లులు రాలేదని.ఇలాంటి పనులు ఇచ్చి బిల్లులు రాకుండా నీ మాదిరి ఇంటి వద్దకు తిప్పించుకోలేనని అందుకే ఆ సంస్థ ద్వారానే పనులు జరిగాయన్నారు.

ఇలాంటి అహకారం, అసత్యపు మాటలు మాట్లాడితే ఇక నుంచి ఊరుకోనన్నారు.ధర్మవరంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానంటే.

ఇక అవతలి వారికి ఓట్లే రావా.ఇలాంటి మాటలు విని జనం నవ్వుకుంటున్నారని శ్రీరామ్ కామెంట్ చేశారు.

ఇక నేను చెప్పేది ఇదే చివరిసారని.కొత్త సంవత్సరం నుంచైనా నువ్వు, నీ పక్కనున్న వారు నోరు అదుపులో పెట్టుకొని ఉంటారని ఆశిస్తున్నానని శ్రీరామ్ వ్యాఖ్యానించారు.

నీతో పాటు నీ అనుచరులకు కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.

తాజా వార్తలు