వైష్ణవ్ తేజ్ ''PVT04'' రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్ బరిలోనే మెగా హీరో!

మెగా హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఒకరు.ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల చేత శబాష్ అనిపించు కున్నాడు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ తెలుగు సినిమా తెరకు పరిచయం అయ్యాడు.ఈ సినిమా దాదాపు 100 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించడంతో ఈయన క్రేజీ హీరోగా మారిపోయాడు.

ఫస్ట్ సినిమా హిట్ తోనే 100 కోట్లు రాబట్టి సూపర్ హిట్ అందుకోవడంతో ఈయనకు పెద్ద పెద్ద బ్యానర్ల నుండి వరుస అవకాశాలు వరించాయి.ఇక ఉప్పెన సినిమా తర్వాత కొండపొలం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న కూడా ఈయన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టు కున్నాడు.ఇక ఇటీవలే వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా సినిమాతో వచ్చాడు.

Advertisement

కానీ ఈ సినిమా పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఈ సినిమా అంతగా హిట్ అందుకోలేక పోయింది.దీంతో ఈ మెగా హీరో కెరీర్ డైలమాలో పడింది.

వరుస ప్లాపులతో ఈయన మార్కెట్ భారీగా డౌన్ అయ్యింది.ప్రెజెంట్ ఈయన తన 4వ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

#PVT04 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ను శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై త్రివిక్రమ్ భార్య సౌజన్యతో కలిసి నాగవంశీ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో తేజ్ కు జోడీగా ధమాకా బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

ఈ సినిమాను ఏప్రిల్ 29, 2023లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.ఈ టైటిల్ పోస్టర్ లో వైష్ణవ్ తేజ్ కంచె లోపల నుండి అస్పష్టంగా కనిపిస్తున్నాడు.చూడాలి మరి ఈ సినిమా అయినా మెగా హీరో కెరీర్ కు ప్లస్ అవుతుందో లేదో.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు