స్టార్ డైరెక్టర్ గా మారబోతున్న సుకుమార్ మరో శిష్యుడు.. ఎవరంటే?

మన టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ల లిస్టులో ఈయన తప్పకుండ ఉంటారు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఇమేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్.

ఈయన సినిమాలు పక్కా హిట్ అనే చెప్పాలి.ఈయన కెరీర్ లో ఒకటి అర సినిమాలు మినహా అన్ని కూడా సూపర్ హిట్ అయినవే.

ఇక సుకుమార్ మాత్రమే కాదు.ఈయన శిష్యులు కూడా సుకుమార్ పేరు నిలబెడుతున్నారు.

సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు తన టాలెంట్ ను మొదటి సినిమాతోనే నిరూపించు కున్నాడు.ఉప్పెన సినిమాతో ఈయన ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

Advertisement

ఈ సినిమాతో బుచ్చిబాబు పేరు ఇండస్ట్రీలో మారుమోగి పోయింది.ఇక ఏకంగా రెండవ సినిమాను రామ్ చరణ్ తో అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు.

అయితే సుకుమార్ శిష్యుల్లో బుచ్చిబాబు కంటే ముందుగా మరొకరు వచ్చారు.

ఆయనే పల్నాటి సూర్య ప్రతాప్.ఈయన ముందుగానే హిట్ అందుకున్న బుచ్చిబాబు అంత ఫోకస్ అవ్వలేదు.కానీ ఇప్పుడిప్పుడే ఈయన కూడా లైమ్ లైట్ లోకి వస్తున్నాడు.

కరెంట్, కుమారి 21 ఎఫ్ సినిమాల తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇప్పుడు 18 పేజెస్ సినిమాను తెరకెక్కించాడు.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

ఈ సినిమాతో క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈయన చిన్న బ్యానర్స్ లోనే సినిమాలు చేసాడు.

Advertisement

కానీ ఇప్పుడు మాత్రం రెండు పెద్ద బ్యానర్స్ లో సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించాడు.ఈయన అప్ కమింగ్ సినిమాలు రెండు బడా బ్యానర్స్ లో తెరకెక్కుతున్నట్టు రివీల్ చేసాడు.

అందులో ఒకటి సితార ఎంటర్ టైన్మెంట్స్ వారితో అయితే మరో సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారితో అని ప్రకటించాడు.మరి ఇంత పెద్ద బ్యానర్స్ అంటే ఖచ్చితంగా హీరోలు కూడా స్టార్ హీరోలే అయ్యే అవకాశం ఉంది.

చూడాలి ఈయన కూడా స్టార్ హీరోను పడతాడో లేదో.

తాజా వార్తలు