Pallavi prashanth : ఆ లేడీ కంటెస్టెంట్లకు భారీ షాకిచ్చిన పల్లవి ప్రశాంత్.. చెల్లి అని చెప్పలేదా అంటూ?

తెలుగులో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే.

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి 14 మంది కంటెంస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా ఇప్పటికే మొదటి వారం ఎలిమినేషన్స్ లో భాగంగా కిరణ్ రాథోడ్( Kiran Rathod ) ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవడంతో ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.

ఇక మొదటివారం ఎలిమినేషన్స్ తర్వాత నామినేషన్స్ లో భాగంగా అందరూ కలిసి ప్రశాంత్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసింది.కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు బాగానే హైలైట్ అయ్యాడని చెప్పాలి.

అందుకు తగ్గట్లుగానే అతడు తరచూ వార్తల్లో నిలుస్తూనే వస్తున్నాడు.ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే రతికాతో( Rathika ) కలిసి కానీ పులిహోర కలిపాడు.ఇక మొదట్లో నుంచి వీరిద్దరి మధ్య స్నేహబంధం మొదలైంది.

వీళ్లిద్దరూ హౌస్‌లో ఎంతో క్లోజ్‌గా ఉంటున్నారు.ముఖ్యంగా లవర్స్‌లా కనిపిస్తూ మజా పంచుతున్నారు.

Advertisement

ఇక బిగ్ బాస్ రెండో వారానికి జరిగిన నామినేషన్స్ టాస్క్ వేడి వేడిగా సాగింది.ముఖ్యంగా చాలా మంది కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్‌నే టార్గెట్ చేశారు.

అందులో అమర్‌దీప్ చౌదరి, ప్రియాంక, శోభా శెట్టి, గౌతమ్‌లు మాత్రం శృతి మించి మరీ ఈ యువ రైతును విమర్శలు చేశారు.

వాళ్లకు రతికా కూడా తోడు అవడంతో ప్రశాంత్‌కు కోలుకోలేని షాక్ తగిలినట్లు అయింది. నామినేషన్స్ టాస్కులో భాగంగా ప్రశాంత్ తనను చెల్లి అని పిలిచినా ఎవరికీ చెప్పకుండా కెమెరాలతోనే మాట్లాడాడని శోభా శెట్టి ( Shobha Shetty )ఆరోపిస్తూ అతడిని నామినేట్ చేసింది.ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న ప్రశాంత్ అన్నయ్య వేరే.

నీలో రెండు ఫేస్‌లు కనిపిస్తున్నాయి.రతిక వెనుక ఎందుకు పడ్డావు? టైటిల్ కోసం వచ్చావా? అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడానికి వచ్చావా అని ప్రశ్నించింది.శోభా శెట్టి మాటలకు పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

నన్ను అన్నయ్య అన్నావని రతికతో చెప్పానో లేదో అడిగి అప్పుడు మాట్లాడు.ఆమె వెనుక పడినా అంటున్నావు కదా.రతికా నేనెప్పుడైనా నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పానా అంటూ సూటిగా ప్రశ్నించాడు.దీనికామె మౌనంగా ఉండిపోయింది.

Advertisement

మొత్తానికి ఒకే దెబ్బకు ఇద్దరు లేడీస్‌కు ఇచ్చి పడేశాడు రైతుబిడ్డ.మాటకు శోభాశెట్టి ఏం మాట్లాడాలో తెలియక దెబ్బకు మౌనంగా ఉండిపోయింది.

తాజా వార్తలు