రైతుబిడ్డకి టాలీవుడ్ లో ఆఫర్ల వెల్లువ..ఏకంగా రామ్ చరణ్ సినిమాలో నటించే ఛాన్స్!

ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ సీజన్ బిగ్ బాస్ రియాలిటీ షో ఎట్టకేలకు రీసెంట్ గానే గ్రాండ్ ఫినాలే తో ముగిసిన సంగతి మన అందరికీ తెలిసిందే.

రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) టైటిల్ విన్నర్ గా నిలవగా, అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే ఈ ఇద్దరికీ ఆడియన్స్ బ్రహ్మారథం పట్టారు అనే చెప్పాలి.ఇకపోతే అమర్ దీప్ కి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది ప్రస్తుతానికి పక్కన పెడితే, పల్లవి ప్రశాంత్ కి మాత్రం సినిమాల్లో భారీ గా అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం మన టాలీవుడ్ లో తెలంగాణ స్లాంగ్ లో వచ్చే సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి.రీసెంట్ గా ఎన్నో ఉదాహరణలు చూసాము.

పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా తెలంగాణ మాండలికం ని తమ సినిమాల్లో రెగ్యులర్ గా వాడుకుంటున్నారు.

, Pallavi Prashanth In Ramcharan Moviedetails , Pallavi Prashanth , Ramcharan
Advertisement
, Pallavi Prashanth In Ramcharan Moviedetails , Pallavi Prashanth , Ramcharan

కేవలం తెలంగాణ స్లాంగ్ మాత్రమే కాదు, ఆడియన్స్ కి కొత్తగా అనిపించే ఏ స్లాంగ్ సినిమా అయినా ఆడేస్తున్నాయి.మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు( Buchibabu Sana ) తో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రం శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది.

వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ సినిమాలో ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ అంబటి ఒక పాత్రకి ఫిక్స్ అయిపోయాడు.

స్వయంగా డైరెక్టర్ బుచ్చి బాబు బిగ్ బాస్ స్టేజి మీద ఈ ప్రకటన చేసాడు.ఇప్పుడు రామ్ చరణ్ కి సహాయ నటుడి పాత్రలో పల్లవి ప్రశాంత్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ బుచ్చి బాబు.

పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ సందర్భాల్లో జనాల చేత కంటతడి పెట్టించేస్తాడు.

, Pallavi Prashanth In Ramcharan Moviedetails , Pallavi Prashanth , Ramcharan
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

కాబట్టి పల్లవి ప్రశాంత్ కచ్చితంగా అలాంటి పాత్రలకు న్యాయం చెయ్యగలడు కాబట్టి, ఆయనకీ ఆ కోణం లో సినిమా అవకాశాలు మెండుగా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.ఈ సినిమా తో పాటుగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) చిత్రం లో నటించే ఛాన్స్ దక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా, మరికొంత మంది మేకర్స్ కూడా పల్లవి ప్రశాంత్ ని తమ సినిమాలో తీసుకుంటే మంచి పబ్లిసిటీ వస్తుందని భావిస్తున్నారు.

Advertisement

చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో ప్రశాంత్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది.

తాజా వార్తలు