మోడీజీ.. మీరు గ్రేట్ అంటున్న పాక్ పత్రికలు.. ఎందుకో తెలుసా..?

ప్రధాని మోదీపై పాక్ పత్రికలు ఇప్పుడు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి.పాక్ లో రాజకీయ సంక్షోభంతో పాటు, ఆర్థిక సంక్షోభం కరాళ నృత్యం చేస్తోంది.

ఇలాంటి టైమ్ లోనే పాక్ లో భారీ వర్షాలు కురిసి పంటలు నేలమట్టమయ్యాయి.దాంతో కరువుతో ప్రజలు అల్లాడి పోతున్నారు.

మరో వైపు సాయం చేస్తాయనుకున్న ఇతర అగ్ర దేశాలు ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు పడుతున్నాయి.అమెరికా లాంటి దేశం మాంధ్యం అంచున నిలబడింది.

దాంతో దాయాదికి సాయం చేసే దేశం కనిపించకుండా పోయింది.ఇన్నాళ్లు.

Advertisement

బార్డర్ పేరుతో చైనాతో పబ్బం గడుపుకున్న పాకిస్తాన్ కు ఆ దారి కూడా మూసుకు పోయింది.అసలే చైనాలో రోజుకు లక్షల్లో కొత్త కేసులు.

వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.దాంతో డ్రాగన్ పాక్ ను పట్టించుకోవడం మానేసింది.

మరో వైపు రష్యా ఉక్రెయిన్ పై దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది.దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయింది.

ఇలాంటి పరిస్థితుల్లో అతిపెద్ద జనాభా ఉన్న దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ. ఎంతో చాకచక్యంతో.దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నారని కితాబిస్తున్నారు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

ఇక ప్రధాని మోదీ.భారత ప్రతిష్టను పెంచుకుంటూ పోతున్నారంటూ షహజాద్ చౌధరి అనే రాజకీయ, భద్రత, రక్షణ విశ్లేషకుడు కథనం కూడా రాశారు.మోదీ తన నైపుణ్యంతో భారత జీడీపీ 3 ట్రిలియన్ డాలర్లకు పెంచారని.

Advertisement

విదేశాంగ విధానాలు అబ్బురపరుస్తున్నాయని కొనియాడారు.వ్యవసాయ ఉత్పత్తులు రికార్డు స్థాయిలో అత్యుత్తమ స్థాయికి పెరిగాయని, ఐటీ పరిశ్రమ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విస్తరించిందని కొనియాడుతూ ఉన్నారు.

కాల పరీక్షకు తట్టుకుని భారత ప్రజాస్వామ్యం దృఢంగా నిలిచిందని షహజాద్ చౌధరి ప్రశంసించారు.మోదీ స్వయంగా భారత్‌కు బ్రాండ్ తీసుకువచ్చేందుకు నడుం కట్టి విజయవంతమయ్యారని కథనంలో రాశారు.ఇంతకు ముందు పాక్ మాజీ ప్రధాని సైతం చాలా సార్లు భారత విదేశాంగ విధానంపైనా, భారత ఆర్థిక వ్యవస్థపైనా, ఆర్మీ వ్యవహారాలపైనా ప్రశంసలు కురిపంచారు.

అప్పుడు వ్యతిరేకించిన పాక్ పత్రికలు ఇప్పుడు మాత్రం ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నాయి.

తాజా వార్తలు