PSL మ్యాచ్‌కు వచ్చి IPL చూస్తున్న ఫ్యాన్స్.. పాక్‌కు ఇంతకన్నా అవమానం ఉందా?

క్రికెట్( Cricket ) అంటే మన భారతీయులకు ఓ ఎమోషన్, ఒక ప్యాషన్.

ప్రతి సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) కోసం క్రికెట్ ఫ్యాన్స్ వెయిటింగ్ మామూలుగా ఉండదు.

పది టీములు, సమ్మర్లో క్రికెట్ పండగ అంటే ఇదే మరి, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ నుంచి లోకల్ టాలెంట్ వరకు ఐపీఎల్ అంటేనే కిక్కు, క్వాలిటీ మ్యాచులు, పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్.స్టేడియాలు, టీవీలు, ఫోన్లలో కోట్లాది మంది లైవ్ చూస్తూ ఉంటారు.

ఈ క్రేజ్ ని మ్యాచ్ చేయడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్లు పాకిస్థాన్ సూపర్ లీగ్ ( PSL ) స్టార్ట్ చేశారు.బంగ్లాదేశ్ కూడా సొంత టీ20 లీగ్ పెట్టుకుంది.

కానీ ఈ లీగులేవీ ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా రాలేదు.సక్సెస్ విషయంలో ఐతే చాలా వెనకబడిపోయాయి.

Advertisement

మెయిన్ తేడా ఎక్కడ కొట్టిందంటే, స్టేడియానికి వచ్చే ఫ్యాన్స్ సంఖ్యలో.చాలా మంది పాకిస్థాన్ ఫ్యాన్స్ పీఎస్ఎల్ మ్యాచులు లైవ్ లో చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని రిపోర్ట్స్ చెప్తున్నాయి.

స్టేడియాలు చూస్తే సగం ఖాళీగానే ఉంటున్నాయి.ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, పీఎస్ఎల్ మ్యాచ్‌కు వచ్చిన కొంతమంది ఫ్యాన్స్ స్టేడియంలో కూర్చొని మరీ ఫోన్లలో ఐపీఎల్ చూడటం మొదలుపెట్టారు.

రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.కరాచీలో లాహోర్ ఖలాండర్స్, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.లాహోర్ టీం 211 రన్స్ కొట్టింది, కానీ కరాచీ కింగ్స్ మాత్రం 136కే ఆల్ అవుట్ అయిపోయింది.

స్టేడియంలో ఒక ఫ్యాన్ లైవ్ మ్యాచ్ చూడకుండా ఫోన్‌లో ఐపీఎల్ చూస్తూ కెమెరాకు దొరికిపోయాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.పీఎస్ఎల్ సపోర్టర్స్ అయితే షేమ్ షేమ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

న్యూస్ రౌండర్ టాప్ 20

నిజం చెప్పాలంటే, ఐపీఎల్ అన్ని విధాలా పీఎస్‌ఎల్ కంటే చాలా ముందుంది.ప్రైజ్ మనీ, ప్లేయర్ శాలరీలు, టోర్నమెంట్ ఫెసిలిటీస్, ఈవెన్ ఆక్షన్ సిస్టమ్ కూడా.ఐపీఎల్ కి పెద్ద పెద్ద బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లు సపోర్ట్ ఉంటే.

Advertisement

పీఎస్‌ఎల్ మాత్రం టీవీ కవరేజ్ కోసం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంది.పీఎస్‌ఎల్ ఐపీఎల్‌తో పోటీ పడాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలని చాలా మంది అంటున్నారు.

ప్రస్తుతానికి అయితే డిఫరెన్స్ కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.పీఎస్‌ఎల్ స్టేడియంలో కూడా.

తాజా వార్తలు