ధోని రికార్డు సమం చేసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్..!!

భారత్ కెప్టెన్ గా ధోని( MS Dhoni ) బాధ్యతలు చేపట్టాక ఒక్కసారిగా భారత్ క్రికెట్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.2007లో మొదటిసారి T20 మొట్టమొదటి ప్రపంచ కప్ ధోని నాయకత్వంలో అందుకున్న టీమిండియా ఆ తర్వాత జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ కూడా గెలవడం జరిగింది.

దీంతో ధోని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమొగింది.

క్లిష్టమైన సమయంలో చాలా కూల్ గా ధోని తీసుకునే నిర్ణయాలు ఎన్నోసార్లు ఇండియా టీంని విజయతీరాలకు చేర్చాయి.చాలా ఫార్మేట్ లలో ధోని సారధ్యంలో అత్యధికంగా ఇండియా టీం విజయాలు సాధించడం జరిగింది.

ఈ క్రమంలో టి20 ఫార్మేట్( T20 ) పరంగా అత్యధికమైన విజయాలు సాధించిన కెప్టెన్ గా ధోనీ పేరిట ఉన్న రికార్డును తాజాగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్( Babar Azam ) సమం చేయటం జరిగింది.T20 లలో కెప్టెన్ గా ఇండియాకు 41 విజయాలు అందించగా., నిన్న కివీస్ తో జరిగిన మ్యాచ్ తో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సారధ్యంలో పాకిస్తాన్ T20.41 మ్యాచ్ విజయాలు నమోదు చేసుకోవడం జరిగింది.ఇక T20 లిస్ట్ లో వీరితోపాటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మోర్గవ్ తో, ఆఫ్ఘన్ మాజీ కెప్టెన్ అస్గర్ 42 విజయాలతో టాప్ లో ఉన్నారు.

మరో రెండు మ్యాచ్ లు బాబర్ ఆజమ్ గెలిస్తే ప్రపంచంలో.అత్యధిక మ్యాచ్ లు గెలిచిన T20 కెప్టెన్ గా రికార్డు క్రియేట్ చేయడం జరుగుతుంది.

Advertisement
జొన్న పిండితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!