ఆక్సిజన్ విషయంలో కేంద్రానికి షాకిచ్చిన కేరళ సీఎం.. ?

కరోనా సోకి ప్రాణాలతో పోరాటం చేస్తున్న వారికి అమృత వాయువుగా మారిన ఆక్సిజన్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురవుతున్న విషయం తెలిసిందే.

ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు మట్టిలో కలిసిపోతున్నాయి.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోవడంతో ఆందోళన చెందుతున్న వారు కూడా ఉన్నారు.ఇదిలా ఉండగా ఇంతటి విషాద సమయంలో కేంద్రానికి షాకిచ్చేలా మాట్లాడారు కేరళ ముఖ్యమంత్రి.

ఇప్పటికే తమ వద్ద ఉన్న అత్యవసర ఆక్సిజన్‌ నిల్వలు సైతం పూర్తి కావస్తున్నాయని కాబట్టి ఇతర రాష్ట్రాలకు ఇకపై ఆక్సిజన్‌ సరఫరా చేసేది లేదని తేల్చి చెప్పారు.ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ప్రధాని మోదీకి సోమవారం రాసిన లేఖలో తమవద్ద కేవలం 86 మెట్రిక్‌ టన్నుల అత్యవసర నిల్వలు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇక ఇప్పటికే ఈ రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.కాగా ముందు ముందు మరిన్ని కేసులు పెగనున్నాయనే ముందు జాగ్రత్తగా మే 15 నాటికి తమకు 450 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విజయన్‌ వెల్లడించారు.

Advertisement
బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?

తాజా వార్తలు