చిన్నప్పుడు లావుగా ఉంటే ఇలాంటి వ్యాధి కూడా రావొచ్చు

చిన్నపిల్లల బుగ్గలు పెద్దగా, గిల్లడానికి బాగుంటే తెగ మురిసిపోతాం.

కాని మనకేం తెలుసు, అలా ఉంటే ఇప్పుడు చూడడానికి బాగానే ఉన్నా, భవిష్యత్తులో కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయని.

చిన్నప్పుడు లావుగా ఉంటే , భవిష్యత్తులో గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ అని ఇప్పటికే మనం చెప్పుకున్నాం.కేవలం హార్ట్ కి సంబంధిచిన వ్యాధులే కాదు, లివర్ కి సంబంధించిన జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

చిన్నతనంలో కాని, టీనేజ్ లో కాని, బాడి మాస్ ఇండెక్స్ (BMI) 25 కన్నా ఎక్కువుంటే, ఒక మధ్యరకం వయసులోకి వచ్చాక లివర్ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట.టీనేజ్, చిన్నతనంలో లావుగా ఉన్నవారు, పెద్దయ్యాక కూడా బరువు, కొవ్వుకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఎదురుకోవాల్సి వస్తుంది.

దీంతో నాన్- ఆల్కహాలిక్ ఫాట్టి లివర్ జబ్బు వచ్చే ప్రమాదం ఉందని 45 వేలమంది మీద జరిగిన ప్రయోగంలో తేలింది.చిన్నతనంలోనే సరైన ఆహారం పట్ల, వ్యాయామం, ఆటల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించి, పిల్లలు కొవ్వు, బరువు సమస్యలతో బాధపడకుండా చూసుకోవాలి, లేదంటే ప్రమాదాలు తప్పవని హెచ్చరించారు డాక్టర్లు.

Advertisement

కాబట్టి ఆటపాటలు కేవలం స్మార్ట్ ఫోన్ల వరకు పరిమితం అవకుండా, బయట కూడా పిల్లలు ఆడుకునేలా ప్రోత్సహించాలి తల్లిదండ్రులు.

మీకు ఈ స‌మ‌స్య‌లు ఉంటే..ఖ‌చ్చితంగా చేప‌లు తినాల్సిందే!

Advertisement

తాజా వార్తలు