ప్రత్యేక హోదా కోసమే ఎన్డీయే నుంచి బయటకు..: చంద్రబాబు

ఏపీకి ప్రత్యేక హోదా కోసమే గతంలో తాను ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వ నాశనం చేశారని ఆరోపించారు.

జగన్ విధానాలతో తెలంగాణకు, ఏపీకి పొంతన లేకుండా పోయిందన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా కోసం మాత్రమే ఎన్డీయేను వదిలి పెట్టినట్లు స్పష్టం చేశారు.

Out Of NDA Only For Special Status..: Chandrababu-ప్రత్యేక హ�

ప్రత్యేక హోదా అనేది సెంటిమెంట్ అంశం అన్న చంద్రబాబు 1980 నుంచే టీడీపీ జాతీయ కూటమిలో భాగంగా ఉందని చెప్పారు.ఇండియా కూటమికి లీడర్ లేకపోవడం బీజేపీకి అనుకూల అంశమని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్తుందో చూడాలన్నారు.రాజకీయ అనుభవం ఉన్నవాళ్లే మోదీని విమర్శించడం లేదని తెలిపారు.

Advertisement

మోదీ వయసు గురించే మాట్లాడే దమ్ము వైసీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.దక్షిణాదిలో తెలంగాణ, కర్ణాటకలోనే కాంగ్రెస్ ఉందని వెల్లడించారు.

జనవరి 22 నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు..
Advertisement

తాజా వార్తలు