త్వరలో టీ 20... కరోనా బారిన పడుతున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు

ఒకపక్క టీ 20 సిరీస్ ప్రారంభమౌతున్న ఈ సమయంలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు వరుసగా కోవిడ్ బారిన పడుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు వరుసగా కోవిడ్ బారిన పడుతున్నారు.

త్వరలోనే ఇంగ్లాండ్ తో టీ 20 సిరీస్ ప్రారంభానికి ముందు సఫారీ జట్టు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు.మొన్ననే సఫారీ జట్టు కు చెందిన ఓ ఆటగాడు మహమ్మారి బారినపడి ఐసోలేషన్‌లోకి వెళ్లగా, ఇప్పుడు తాజాగా మరో క్రికెటర్‌కు కూడా ఈ వైరస్ సంక్రమించినట్లు తెలుస్తుంది.

దీంతో అతడిని జట్టు నుంచి వేరు చేసి ఐసోలేషన్‌కు పంపినట్లు సమాచారం.జట్టు వైద్య బృందం ఆటగాడి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది.

అయితే, తాజాగా కరోనా బారినపడిన ఆటగాడు ఎవరన్న వివరాలు మాత్రం బోర్డు ఇప్పటివరకు వెల్లడించలేదు.ఒకపక్క టీ 20 దగ్గర పడుతున్న ఈ సమయం లో ఇలా వరుసగా ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండడం జట్టులో మరింత ఆందోళన కలుగుతుంది.

Advertisement
One More South Africa Cricketer Tests Covid Positive, Corona Virus, Covid19, Sou

ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనుండగా ఈ నెల 27న కేప్‌టౌన్‌లో తొలి టీ20 జరగనున్న సంగతి తెలిసిందే.

One More South Africa Cricketer Tests Covid Positive, Corona Virus, Covid19, Sou

అయితే ఈ సమయంలో సఫారీ జట్టులో ఓ ఆటగాడు కరోనా బారినపడ్డాడని, ముందు జాగ్రత్త చర్యగా ముగ్గురు ఆటగాళ్లను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచినట్టు బుధవారం క్రికెట్ సౌతాఫ్రికా తెలిపింది.కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.సినీ ఇండస్ట్రీ, ఆటగాళ్లు ఇలా ప్రతి ఒక్కరూ కూడా కరోనా బారిన పడుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.

Advertisement

తాజా వార్తలు