మరోసారి ఆస్కార్‌ లిస్ట్‌లో రాజమౌళి ఆర్ఆర్ఆర్.. ఏ కేటగిరీలో చేరిందో మీకు తెలుసా?

ఆర్ఆర్ఆర్.( RRR ) ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.

ఎందుకంటే ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకుల ఎన్నో కలలను నెరవేర్చింది.అంతేకాకుండా మొట్టమొదటిసారి ఆస్కార్‌( Oscar ) బరిలో కూడా నిలిచింది.

అంతే కాకుండా ప్రపంచం మొత్తం ఇండియన్ సినిమాల వైపు చూసేలా చేసింది.తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా చేసింది.

కాగా ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్( Naatu Naatu Song ) బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరిలో నిలిచి అవార్డ్‌ ను సైతం దక్కించుకుంది.ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్‌ వచ్చిన తరువాత అకాడమి జ్యూరీలో ఇండియన్‌ సినిమాల ప్రస్థావన తరుచూ కనిపిస్తోంది.

Advertisement

అకాడమీస్‌ బ్రాంచ్‌ ఆఫ్ యాక్టర్స్ లిస్ట్‌ లో ఆర్ఆర్ఆర్ హీరోలిద్దరికీ స్థానం కూడా దక్కింది.

అయితే ఇప్పుడు మరోసారి ఆర్ఆర్ఆర్ ను గుర్తు చేసుకుంది ఆస్కార్‌ జ్యూరీ.అకాడమి జ్యూరీ స్టార్ట్ అయి వందేళ్లు పూర్తయిన సందర్భంగా అవార్డ్స్‌ లిస్ట్‌ లో కొన్ని కొత్త కేటగిరీలను కూడా చేర్చింది.ఈ లిస్ట్‌ లో యాక్షన్ డిజైన్‌ కేటగిరినీ ట్రిపులార్‌ లోని యాక్షన్‌ స్టిల్‌ తో ఎనౌన్స్ చేయటంతో ఇండియన్‌ ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

మరోసారి అంతర్జాతీయ వేదిక మీద ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్థావన రావటంతో తెలుగు ఆడియన్స్‌ ఆస్కార్‌ వైబ్‌ లోకి వెళ్లిపోయారు.చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వడంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దీని గురించి రాజమౌళి( Rajamouli ) కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.వందేళ్ల కళ ఇప్పుడు నెరవేరింది అంటూ యాక్షన్ డిజైన్‌ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ ఎంపిక చేయడంపై సంతోషం వ్యక్తం చేసారు.ఆ పోస్టు కాస్త వైరల్ అవ్వడంతో జక్కన్న పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఈ క్రెడిట్ అంతా మీదే జక్కన్న అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

అయితే మరి ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) రామ్ చరణ్( Ram Charan ) లో ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.ఆర్ఆర్ఆర్ సినిమా తారక్, చెర్రీ ల క్రేజ్ ని కూడా మార్చేసింది.

Advertisement

తాజా వార్తలు