నాగుల చవితి రోజు ఇక్కడి పుట్టలో.. పాలు పోస్తే సంతానం లేని దంపతులకు సంతానం..?

దీపావళి పండుగ( Diwali festival ) తర్వాత నాలుగు రోజులకు వచ్చే నాగుల చవితి( Nagula Chavithi ) పండుగను మన దేశంలోని ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.

ఈ పండుగ రోజు ఉదయం నిద్ర లేచి, తలస్నానం చేసి, సమీపంలో ఉన్న నాగదేవత పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని( Lord Subrahmanyeshwar ) పూజిస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగుల చవితి పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది.ఈ పండుగ రోజు కృష్ణాజిల్లాలో ఉన్న ఈ దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.

ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.చవితి రోజు మాత్రమే కాకుండా ఇతర రోజుల్లో కూడా ఈ దేవాలయానికి భక్తులు భారీగా తరలివస్తారు.

అయితే నాగుల చవితికి మాత్రం ఈ దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందింది అని స్థానిక ప్రజలు చెబుతున్నారు.కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మోపిదేవి( Mopidevi ) లోని స్వయంభుగా శివలింగకృతిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చే దేవతామూర్తులుగా భక్తులకు దర్శనమిస్తున్నారు.ముఖ్యంగా సంతానం లేని వారు కోరిన కోరికలు తీర్చే దేవత మూర్తిగా విరుజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన( Shri Valli Devasena ) సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మోపిదేవిలో కొలువై ఉన్నారు.

Advertisement

ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న నాగదేవత పుట్ట నాగమల్లి వృక్షం విశిష్ట మహిమగలవాని భక్తులు భావిస్తారు.

అలాగే సంతానం లేని వారు నాగమల్లి వృక్షానికి ముడుపులు కడతారు.నాగ దేవత పుట్టలో పాలు పోయడం ఇక్కడ విశిష్టత.పుట్టలో పాలు పోయడం ద్వారా నాగదేవత అనుగ్రహం లభిస్తుందని భక్తులు బలంగా నమ్ముతారు.

అంతేకాకుండా వివాహం కానీ యువతి, యువకులు ఈ దేవాలయాన్ని దర్శించుకుని నాగ దేవత పుట్టలో పాలు పోసి, నాగమల్లి వృక్షానికి ముడుపు కట్టడం వల్ల మరుసటి సంవత్సరమే వారి కోరిక నెరవేరుతుందని భక్తులు చెబుతున్నారు.అలాగే సంతానం లేని వారు నాగమల్లి వృక్షానికి ఉయ్యాలా కట్టడం ఇక్కడ విశిష్టమైనదిగా చెబుతున్నారు.

శివలింగాకృతిలో స్వామి పడగ నీడన ఉండడంతో ప్రతిరోజు అర్చకులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు చేస్తారు.ఆ తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు.

దానిమ్మ గింజల గురించి ఆ అద్భుత విషయం తెలిస్తే.... ముఖ్యంగా మగవారికి కోసం
Advertisement

తాజా వార్తలు