నీ యవ్వ తగ్గేదేలే.. డబుల్ డెక్కర్ సైకిల్‌పై తాత సవారీ

సోషల్ మీడియాలో అనేక ఇంట్రెస్టింగ్ వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ఏదైనా కొంచెం ఆసక్తికరంగా, వినూత్నంగా అనిపిస్తే నెటిజన్లు వైరల్ చేస్తూ ఉంటారు.

అందులో భాగంగా తాజాగా ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో ఓ డబుల్ డెక్కర్ సైకిల్‌పై( Double Decker Cycle ) ఓ వృద్ధుడు ప్రయాణిస్తున్నాడు.

డబుల్ డెక్కర్ బస్సులు, ట్రైన్ల గురించి వినే ఉంటాం.కానీ డబుల్ డెక్కర్ సైకిల్స్ గురించి మీరు ఎప్పుడూ విని ఉండరు.

దీంతో వినూత్నమైన డబుల్ డెక్కర్ సైకిల్‌పై వృద్ధుడు రోడ్డుపై వెళుతుండటం అందరినీ ఆకట్టుకుంటోంది.

Advertisement

డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.గత నెల 30న ట్విట్టర్‌లో షేర్ చేయగా.ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇందులో వృద్ధుడు జుగాడ్ తయారుచేసిన డబుల్ డెక్కర్ సైకిల్ పై వెళుతూ ఉన్నాడు.ఈ సైకిల్ జుగాడ్ తయారుచేసింది.

అట్లాస్ సైకిల్ ఫ్రేమ్‌ను( Atlas Cycle ) తొలగించి హ్యాండిల్‌కు బదులుగా కారు స్టీరింగ్ వీల్ అమర్చారు.దీంతో ఈ సైకిల్ చూడటానికి చాలా విభిన్నంగా ఉంది.

ఈ సైకిల్ నడుపుతూ వృద్ధుడూ రోడ్డుపై వెళుతుండగా కొంతమంది వీడియో తీశారు.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!

సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు.అసలు ఈ సైకిల్‌పైకి తాతయ్య ఎలా ఎక్కాడని కొంతమది ఫన్నీగా కామెంట్ చేస్తోన్నారు.ఇక మరికొందరు మామయ్యకు బ్రేకులు వేయాలంటే ఏం చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

ఇలా నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు.ఈ సైకిల్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మరోక నెటిజన్ అడిగాడు.

ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, లైకులు వస్తున్నాయి.ఈ వీడియోను పోస్ట్ చేసిన డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్.

దీనికి మంచి శీర్షిక చెప్పండి అంటూ నెటిజన్లను కోరాడు.దీంతో నెటిజన్లు తమకు తోచినట్లు స్పందిస్తున్నారు.

తాజా వార్తలు