ఆఫర్‌లో వచ్చాయని కూరగాయలు కొనుగోలు చేశాడు.. ఇంటికొచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే షాక్..

మనం ఏదైనా షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు చాలా వస్తువులపై అనేక ఆఫర్లు ఉంటాయి.అనేక ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు.

అలాగే కొన్ని వస్తువులపై ఒకటి కొంటే ఒకటి ఉచితమంటూ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు.ఈ ఆఫర్లకు చాలామంది ఆకర్షితులై వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు.

తాజాగా కూరగాయల మార్కెట్‌కి( Vegetable Market ) వెళ్లిన ఒక వ్యక్తి అలాంటి ఆఫర్ చూసి ఆకర్షితుడై కొనుగోలు చేశాడు.ఆ తర్వాత ఇంటికి వెళ్లిన తర్వాత కవర్ ఓపెన్ చేసి చూడగానే షాక్ అయ్యాడు.

ఒక వృద్ధుడు సూపర్ మార్కెట్‌కి వెళ్లి బ్రోకలి( Broccoli ) కొనుగోలు చేశాడు.ఒకటి కంటే మరొకటి ఫ్రీ అని చెప్పడంతో ఆశపడి బ్రోకలి కొనుగోలు చేశాడు.అయితే ఇంటికి వెళ్లిన తర్వాత కవర్‌ను ఓపెన్ చేసి చెక్ చేయగా.

Advertisement

బ్రోకలి మధ్యలో పాము( Snake ) కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు.కాసేపు తర్వాత షాక్ నుంచి కోలుకుని నేరుగా కవర్‌ను తీసుకుని సూపర్ మార్కెట్‌కి వెళ్లి అక్కడి సిబ్బందికి చూపించాడు.

ఇంగ్లండ్‌కు( England ) చెందిన నెవిల్లే లింటన్ అనే వృద్ధుడికి ఈ భయానక ఘటన ఎదురైంది.

63 సంవత్సరాల నెవిల్లే లింటన్.తన ఇంటి సమీపంలోని సూపర్ మార్కెట్‌కి వెళ్లి బ్రోకలి కొనుగోలు చేశాడు.ఇంటికొచ్చిన తర్వాత కవర్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టాడు.

ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత వాటిని వండుకుందామని బయటకు తీశాడు.కవర్‌లో ఉన్న బ్రోకలీలను బయటకు తీయగా.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown

మధ్యలో పాము కనిపించింది.ఒక చిన్న పాము బ్రోకలి మధ్యలో నిద్రపోతూ కనిపించింది.గొంగళి పురుగు రంగులో ఆ పాము ఉంది.

Advertisement

ఆ తర్వాత సూపర్ మార్కెట్‌కి వెళ్లి సిబ్బందికి పామును చూపించాడు.అయితే అది ప్రమాదకరమైన పాము కాదని అక్కడి సిబ్బంది చెప్పడంతో వృద్ధుడు ఊపిరిపీల్చుకున్నాడు.

తాజా వార్తలు