'ఓబేబీ' టాక్‌ సరే కలెక్షన్స్‌ పరిస్థితి ఏంటీ?

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ చిత్రం భారీ అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అంచనాలకు ఈ చిత్రం అందుకుంది.

కేవలం 15 కోట్ల లోపు బడ్జెట్‌తో ఈ చిత్రంను నిర్మాతలు నిర్మించారు.విడుదలకు ముందే దాదాపుగా పాతిక కోట్ల బిజినెస్‌ చేసింది.

ఇక విడుదల తర్వాత ఈ చిత్రం మరింతగా కుమ్మేస్తోంది.మొదటి రోజు ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో కలిపి 2.44 కోట్ల షేర్‌ను దక్కించుకుంది.ఇక రెండవ రోజు కాస్త అటు ఇటుగా 2 కోట్ల రూపాయల షేర్‌ను రాబట్టింది.

నేడు ఆదివారం అవ్వడంతో మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.దాంతో నేడు కూడా షేర్‌ భారీగానే ఉండబోతుంది.

Advertisement

మొదటి వారం రోజుల్లో 10 కోట్లకు పైగా రాబట్టడం ఖాయంగా ఉంది.లాంగ్‌ రన్‌ లో ఈ చిత్రం 20 కోట్ల వరకు షేర్‌ను రాబట్టబోతుంది.అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం 10 కోట్లకు అమ్ముడు పోయింది.20 కోట్ల షేర్‌ రాబట్టనున్న నేపథ్యంలో 10 కోట్ల మేరకు బయ్యర్లకు అదనంగా రాబోతున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

సురేష్‌బాబు మరో నలుగురు నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.సమంత సినిమా మొత్తంను తన భుజాలపై వేసుకుని మోసింది.మొత్తానికి ఈ చిత్రం దుమ్ము రేపుతూ వసూళ్లను దక్కించుకుంటుంది.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్న ఓ బేబీ చిత్రానికి పెద్ద చిత్రాల పోటీ లేకపోవడంతో పాటు, విడుదలైన చిన్న చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.దాంతో ఓ బేబీ రెండు వారాల వరకు కుమ్మేయడం ఖాయం.

పాతిక కోట్ల వరకు కూడా వెళ్లనుందేమో చూడాలి.

మనిషి చివరి క్షణాలలో.. ఈ వస్తువులు దగ్గర్లో ఉంటే స్వర్గం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు