'ఓజీ' టీజర్ ఇక లేనట్టే..చివరి నిమిషం లో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన మేకర్స్!

కోట్లాదిమంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఓజీ మూవీ( OG movie ) టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా నుండి ఇప్పటి వరకు కనీసం ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అవ్వకపోయినా కూడా అంచనాలు ఏమాత్రం తగ్గలేదు.

ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన రోజు నుండి నేటి వరకు ఈ సినిమా మీద హైప్ పెరుగుతూనే ఉంది.పవన్ కళ్యాణ్ నుండి చాలా కాలం తర్వాత వస్తున్నా డైరెక్ట్ సినిమా కావడం వల్లే ఇంత హైప్ కి కారణం.

అందులోనూ ఈమధ్య యాక్షన్ జానర్ సినిమాలకు క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు.సీనియర్ హీరోలు చేసినా కూడా రికార్డ్స్ గల్లంతు అవుతున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రేంజ్ స్టార్ స్టేటస్ ఉన్నోళ్లు ఈ జానర్స్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Advertisement

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు( Pawan Kalyan Birthday ) సందర్భంగా సెప్టెంబర్ 2 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా నిర్మాతలు ప్రకటించారు.కేవలం యూట్యూబ్ లో మాత్రమే కాదు, సెప్టెంబర్ 2 న ప్రదర్శింపబడే గుడుంబా శంకర్ థియేటర్స్ లో కూడా ఈ టీజర్ ని వెయ్యబోతున్నారని ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు అలా ప్రదర్శితమయ్యే ఛాన్స్ లేదని తెలుస్తుంది.

ఎందుకంటే థియేటర్స్ లో టీజర్ ని ప్రదర్శించాలంటే కచ్చితంగా సెన్సార్ చేయించాలి.టీజర్ కట్ ఎడిటింగ్ వర్క్స్ మొత్తం పూర్తి అయ్యింది నిన్ననే అట.ఇప్పటికిప్పుడు సెన్సార్ కి పంపడం అనేది సాధ్యమైనది కాదని, సమయం బాగా పడుతుందని, కాబట్టి టీజర్ థియేటర్స్ లో వెయ్యడం ప్రస్తుతానికి అసాధ్యమనే చెప్తున్నారు.ఈ టీజర్ ని థియేటర్స్ లో చూడడానికి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసారు, కానీ అది జరగడం కష్టం అని తెలియడంతో నిరాశకి గురయ్యారు.

సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 5 షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది.ఇందులో పవన్ కళ్యాణ్ మూడు షెడ్యూల్స్ లో పాల్గొన్నాడు.ఇక ఆ తర్వాత మధ్యలో వారాహి విజయ యాత్ర టూర్ ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్, అక్టోబర్ నుండి మళ్ళీ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

ఈ షెడ్యూల్ బ్యాంకాక్ లో జరగబోతుంది.ఈ షెడ్యూల్ తోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అవుతుందని అంటున్నారు.ఇకపోతే ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ( Emraan Hashmi ) విలన్ రోల్ లో కనిపించబోతుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ హిస్టరీ లోనే ది బెస్ట్ టీజర్స్ లో ఒకటిగా నిలిచిపోతుందని అంటున్నారు, చూడాలి మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో అనేది.

Advertisement

తాజా వార్తలు