'దేవర' డిజిటల్ రైట్స్.. రికార్డ్ ధర పలికిన ఎన్టీఆర్ మూవీ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దేవర.

( Devara ) ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతుంది.

తారక్ ఆర్ఆర్ఆర్ ( RRR movie )వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని ఆ తర్వాత కొరటాల శివ సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టింది.అయినా కూడా ఇప్పుడు శరవేగంగా పూర్తి చేస్తూ అప్పుడే సగం ఫినిష్ చేసినట్టు టాక్.నవంబర్ నెలాఖరుకు ఈ సినిమా షూట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.

అందుకే గ్యాప్ లేకుండా షూటింగ్ ముగించేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి మెయిన్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేసారు.

Advertisement

ఎన్టీఆర్ ( NTR )తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్,( Janhvi Kapoor ) విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ అవ్వగా మంది రెస్పాన్స్ అందుకున్నాయి.ఇదిలా ఉండగా ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమా ఓటిటి డీల్స్ గురించి ఇప్పుడు సమాచారం బయటకు వచ్చింది.

ఓటిటి డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం.ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు టాక్.ఈ రైట్స్ కు ఏకంగా 150 కోట్లు పెట్టి దక్కించుకున్నట్టు తెలుస్తుంది.

అంటే షూటింగ్ పూర్తి కాకుండానే ఓన్లీ డిజిటల్ రైట్స్ తోనే పెట్టుబడి సగం వచ్చినట్టే అని చెప్పవచ్చు.ఇది రికార్డ్ ధర అని చెప్పవచ్చు.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు