టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఇటీవలే దేవర( Devara ) సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2( War 2 ) సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నారు ఎన్టీఆర్.
మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీపై కేవలం ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఎన్టీఆర్,నీల్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇంతకీ ఆ న్యూస్ ఏమిటి అన్న విషయానికి వస్తే.2025 సంక్రాంతికి ఎన్టీఆర్ అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఉంటుందట.సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్, నీల్ మూవీ టైటిల్ ని ప్రకటించాలని మేకర్స్ నిర్ణయించారట.
ఈ సినిమాకి డ్రాగన్( Dragon ) అనే టైటిల్ మొదటి నుంచి ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.అయితే మరి అదే టైటిల్ ని ఖరారు చేస్తారా? లేక వేరే కొత్త టైటిల్ ఏమైనా అనౌన్స్ చేస్తారా అన్నది త్వరలో తేలిపోనుంది.జనవరి నుంచి ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనే అవకాశముందట.
ఎన్టీఆర్-నీల్ మూవీ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.ఈ చిత్రంలో రుక్మిణి వసంత్( Rukmini Vasanth ) హీరోయిన్ గా నటించనుందని సమాచారం.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy