దేవర సీక్వెల్ కు ఇప్పట్లో ఛాన్స్ లేదా.. ఎన్టీఆర్ లైనప్ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసిందా?

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన చిత్రం దేవర.

( Devara ) ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు భారీగా కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కనుండగా మొదటి భాగం ఇటీవలె విడుదల అయింది.ఇక పార్ట్ 2 త్వరలోనే విడుదల కానుంది అంటూ మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే పార్ట్ 2 విడుదల విషయంలో ఇప్పటకే ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.

ఈ సినిమా ఇప్పుడే విడుదల కాదు.ఇంకా చాలా సమయం పడుతుంది అంటూ వార్తలు కూడా వినిపించాయి.ఇకపోతే హారిక హాసిని సిస్టర్ కన్సర్న్ గా స్టార్ట్ అయింది సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ.

Advertisement

ఈ సంస్థ నుంచి ఏడాదికి నాలుగు ఐదు సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.ఇప్పుడు బాలయ్య, విజయ్ దేవరకొండ, రవితేజ ల సినిమాలు రాబోతున్నాయి.ఇప్పుడు వాటన్నింటిని మించి ఒక పాన్ ఇండియా సినిమా రాబోతోంది.

ఎన్టీఆర్- నీల్సన్ సినిమాను సితార బ్యానర్ నిర్మించబోతోంది.కాగా ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలలో నీల్సన్ సినిమా కూడా ఒకటి.

వార్ 2, ప్రశాంత్ నీల్, సినిమాల తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా నీల్సన్ దే.ప్రస్తుతం వార్ 2,( War 2 ) ప్రశాంత్ నీల్( Prasanth Neel ) సినిమాల పని మీద వున్నారు తారక్.వాటిలో ఒకటి పూర్తి కాగానే వెంటనే నీల్సన్( Nelson ) సినిమా పనులు మొదలు పెట్టనున్నారు.

ఈ ప్రకారంగా చూసుకుంటే దేవర సినిమాకు ఇంకా చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది.ఎన్టీఆర్ చేతిలో ఉన్న మూడు సినిమాలు తర్వాతనే దేవర 2( Devara 2 ) సినిమా పని మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కిరణ్ అబ్బవరంకు పరోక్షంగా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు