'ఎన్టీఆర్‌ మహానాయకుడు' క్లోజింగ్‌ కలెక్షన్స్‌.... ఖచ్చితంగా మీరు నమ్మరు

నందమూరి తారక రామారావు బయోపిక్‌ ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రం విడుదల అవ్వడం, క్లోజ్‌ అవ్వడం కూడా జరిగింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా మహానాయకుడు బొమ్మ కనిపించదు.

కొన్ని ప్రాంతాల్లో ఫ్రీగా వేస్తామంటూ బోర్డులు పెడుతున్నారు.ఆ షోలకు కూడా ప్రేక్షకులు కనిపించడం లేదు.

అత్యంత దారుణమైన మహానాయకుడు ఫలితం నందమూరి అభిమానుల్లోనే కాకుండా అంతా కూడా అవాక్కయ్యేలా చేస్తుంది.మహానాయకుడు చిత్రం ఫుల్‌ రన్‌లో కేవలం 5 కోట్ల వసూళ్లను మాత్రమే నమోదు చేసింది.

ఇంతటి దారుణమైన ఫలితం బాలకృష్ణ హీరోగా పరిచయం అయినప్పటి నుండి కూడా ఎప్పుడు చవి చూడలేదు.పెట్టిన పెట్టుబడిలో, బిజినెస్‌లో కనీసం 10 శాతం అయినా సినిమా రాబట్టక పోవడం తెలుగు సినిమా చరిత్రలో కూడా ఇదే ప్రథమం అయ్యి ఉంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమా మినిమంగా పాతిక కోట్లు రాబడుతుందనే నమ్మకం వ్యక్తం అయ్యింది.

Advertisement

కాని అనుకున్న మొత్తంలో నాల్గవ వంతు అయినా వసూళ్లు చేయలేక పోయింది.

ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రం 100 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది.అయితే ఆ సినిమా 20 కోట్లు మాత్రమే రాబట్టింది.మహానాయకుడు సినిమా విషయంలో రిస్క్‌ వద్దనుకున్న బాలయ్య సొంతంగానే విడుదల చేసేందుకు ప్రయత్నించాడు.

ఆ కారణంగానో లేదా మరేంటో కాని అత్యంత దారుణమైన ఫలితం నమోదు అయ్యింది.అలా అని ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమాకు బ్యాడ్‌ టాక్‌ వచ్చిందని కూడా కాదు.

పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా ఈ కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి.ఇంతటి దారుణమైన ఫలితాలు నమోదు అవ్వడంతో బాలయ్య ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది.

'తులసి' వల్ల ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు
Advertisement

తాజా వార్తలు