ఆయన ప్లాన్ చేస్తే నటించడానికి నేను సిద్ధమే.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్( Ntr ) ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన కర్ణాటకలోని పలు దైవదర్శనాలను చేస్తూ సందడి చేస్తున్నారు.

అక్కడ డైరెక్టర్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) అలాగే రిషబ్ శెట్టి( Rishabh Shetty ) తో కలిసి ఈయన పురాతన ఆలయాలను సందర్శిస్తూ సందడి చేస్తున్నారు.ఇలా సాంప్రదాయ పద్ధతిలో ఎన్టీఆర్ సతీసమేతంగా కర్ణాటకలోని పలు ఆలయాలకు వెళ్తూ సందడి చేయడమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా ఈ ముగ్గురు కలిసి పలు ఆలయాలను సందర్శిస్తూ కనిపించడంతో వీరికి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.ఇటీవల కాలంలో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతారా ( Kanthara ) సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమాకు ప్రీక్వెల్ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

మరి ఈ వార్తలు నిజమేనా అంటూ కన్నడ రిపోర్టర్స్ ఎన్టీఆర్ ను ప్రశ్నించారు.

Advertisement

ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం చెబుతూ రిషబ్ శెట్టి దాని గురించి ప్లాన్ చేయాలి ఆయన కనుక ప్లాన్ చేస్తే చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నాను అంటూ నవ్వుతూ ఎన్టీఆర్ సమాధానం చెప్పారు.దీంతో కచ్చితంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నారని, ఈ విషయాన్ని ఈయన పరోక్షంగా చెప్పారు అంటూ ఈ వార్తను మరింత వైరల్ చేస్తున్నారు.ఇక కాంతార సినిమా మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు నేషనల్ అవార్డు అందుకోబోతున్నారు.

ఇక త్వరలోనే ఈ సినిమా ప్రీక్వెల్ చిత్రం రాబోతోంది.ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే ఈయన దేవర సినిమా( Devara Movie ) పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాతో ఎన్టీఆర్ బిజీ కానున్నారు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు