ఎన్నారై నిధుల లెక్క మారిందట...కేరళ ని వెనక్కి నెడుతున్న ఆ రాష్ట్రాలు ఇవే..!!!

ఎన్నారై నిధులు అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది కేరళ రాష్ట్రం, కేరళకు ఆ రాష్ట్రానికి చెందిన విదేశాలలో ఉంటున్న ఎన్నారైలు పెద్ద ఎత్తున నిధులు పంపుతుంటారు.

అంతేకాదు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులు పెట్టడం, రియలెస్టేట్ రంగం, ఇలా పలు రకాలుగా ఎన్నారైలు నిధులను మళ్లిస్తుంటారు.

అయితే ఇప్పుడు ఈ పరిస్థితి తారుమారయ్యిందని, గతంలోలా కేరళకు ఎన్నారైలు నిధులు పంపడం లేదని కేరళ స్థానాన్ని భర్తీ చేయడంలో పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని అంటోంది యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్. తాజాగా తాను చేసిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయని తెలిపింది.

పూర్తి వివరాలలోకి వెళ్తే.భారత దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు అన్నిటిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఎన్నారైలు అత్యధిక శాతం నిధులను తమ రాష్ట్రానికి పంపుతుంటారు.అయితే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ చేసిన అధ్యయనంలో ప్రస్తుతానికి కేరళ టాప్ ప్లేస్ లో ఉన్నా ఈ స్థానంలో త్వరలో పడిపోతోందని, కేరళ స్థానాన్ని భర్తీ చేయడంలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిసా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని అంటోంది.2020 ఏడాదిలో విదేశాలకు వెళ్ళిన వారిలో సుమారు 50 శాతం మంది ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిసా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వారే ఉన్నారని, కేరళ రాష్ట్రం నుంచీ వెళ్ళే వారి సంఖ్య ఊహిచని విధంగా తగ్గిందని దాంతో భవిష్యత్తులో ఆయా రాష్ట్రాలకే అధిక మొత్తంలో నిధులు వెళ్లనున్నాయని అంచనా వేసింది.ఇదిలాఉంటే కేరళ వాసులు నిధులు పంపుతున్నారంటే మెజారిటీ శాతం యూఎఈ నుంచీ వచ్చేవే ఎందుకంటే కేరళ వాసులు అత్యధికంగా అరబ్బు దేశాలలోనే స్థిరపడ్డారు.

కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా మారింది.యూఏఈ కంటే అత్యధికంగా అమెరికా నుంచీ నిధులు దేశంలోకి వస్తున్నాయట.అమెరికా నుంచీ భారత్ కు వచ్చే నిధులు 24 శాతం ఉండగా, యూఏఈ నుంచీ వచ్చే నిధుల వాటా 18 శాతంగా ఉందట.

Advertisement

Attachments area .

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు