సరికొత్త ఫీచర్ తో గూగుల్ పే, ఫోన్ పే లకు చెక్ పెట్టనున్న యూపీఐ..!

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్( NPCI ) వ్యాపారుల కోసం తీసుకొచ్చిన కొత్త ఇన్నోవేషన్ ఫీచర్ యూపీఐ ప్లగ్ ఇన్.

ఈ సరికొత్త ఫీచర్ ఫోన్ పే, గూగుల్ పే వంటి కంపెనీలను ఆందోళనకు గురిచేస్తుంది.

థర్డ్ పార్టీ యాప్ లేకుండానే ఈ సరికొత్త ఫీచర్ తో డైరెక్ట్ గా పేమెంట్ సేకరించడానికి వీలుంటుంది.ఉదాహరణకు స్విగ్గీ యాప్ వాడుతున్న ఓ కస్టమర్ యూపీఐ పేమెంట్స్( UPI Payments ) చేయాలంటే ముందుగా గూగుల్ పే లేదా ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్ లోకి వెళ్లి పేమెంట్ చేయాలి.

ఆ పేమెంట్ పూర్తయ్యాక తిరిగి స్విగ్గీకి రీడైరెక్ట్ అవుతుంది.అయితే ఈ అదనపు స్టెప్ వల్ల పేమెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ.

కానీ యూపీఐ ప్లగ్ ఇన్ ద్వారా పేమెంట్స్ ఫెయిల్యూర్స్ తగ్గే అవకాశం ఉంటుంది.

Advertisement

పేటీఎం లాంటి పేమెంట్ గేట్ వే అండ్ ప్రాసెసింగ్ సంస్థలు తమ మర్చంట్లకు యూపీఐ ప్లగ్ ఇన్ ఫీచర్ ను( UPI Plug-In ) ఆఫర్ చేస్తున్నాయి.పేమెంట్ సక్సెస్ రేట్ 15 శాతం వరకు పెరుగుతుందని చెబుతున్నారు.కానీ ఫోన్ పే( Phonepe ) లాంటి కంపెనీలు మాత్రం ఈ ఫీచర్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని, టెక్నికల్ గా ఎక్కువ బెనిఫిట్స్ కూడా లేవని అంటున్నాయి.

ఈ విధానం వల్ల పేమెంట్ సిస్టం మరింత క్లిష్టంగా మారుతుందని, మర్చంట్లపై ఒత్తిడి పెరుగుతుందని ఫోన్ పే చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ రాహుల్ చారి పేర్కొన్నారు.

యూపీఐ ట్రాన్సాక్షన్ అంటే ఫోన్ పే లేదా గూగుల్ పే మాత్రమే ఉపయోగిస్తూ ఉండడంతో ఇవే అగ్రస్థానంలో ఉన్నాయి.అయితే యూపీఐ ప్లగ్ ఇన్ ఫీచర్ తో స్విగ్గి, అమెజాన్, zomato వంటి మర్చంట్ యాప్లు పేమెంట్ ను డైరెక్ట్ గా కలెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది.యూపీఐ ట్రాన్సాక్షన్లలో 57% వాటా మర్చంట్ ట్రాన్సాక్షన్లదే.

కాబట్టి ఫోన్ పే, గూగుల్ పే లలో ట్రాన్సాక్షన్లు తగ్గే అవకాశం ఉంటుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు