ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా PayTM వాడుకోండి ఇలా

PayTM అంటే ఏంటో ఇప్పుడు కొత్తగా చెప్పనక్కరలేదు అనుకుంటా.

పాత కరెన్సీ మీద బ్యాన్ విధించినప్పటి నుంచి ఈ మొబైల్ వాల్లేట్ ని వాడే జనాభా బాగా పెరిగిపోయింది.

సినిమా టికెట్ల నుంచి, విమాన టికెట్ల దాకా, అన్ని ఖర్చులు PayTM ద్వారానే చెల్లిస్తున్నారు పట్టణ జనాభా.చేతిలో కరెన్సీ లేనప్పుడు ఈ PayTM బాగా పనికివస్తోంది.

Now You Can Make Payments Through PayTM Without Internet-Now You Can Make Paymen

అందుకే రోజుకి వందల కోట్ల ట్రాన్ సాక్షన్స్ ఈ యాప్ ద్వారా జరుగుతున్నాయి.PayTM ద్వారా ఇతరులకి చెల్లించాలంటే, వారికి PayTM అకౌంట్ ఉండాల్సిందే.

అంతేకాక, వారి మొబైల్ నంబర్ మనదగ్గర ఉండాలి, లేక QR Code ని స్కాన్ చేసి పేమెంట్ చేయాలి.ఇవన్ని జరగాలంటే ఫోన్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

Advertisement

అదో సమస్య.కాని ఇప్పుడు ఆ అవసరం లేదు.

ఇంటర్నెట్ లేకుండా కూడా PayTM ద్వారా చెల్లింపులు చేయవచ్చు.అందుకోసమే 1800 1800 1234 అనే టోల్ ఫ్రీ నంబర్ ని తీసుకొచ్చింది ఆ సంస్థ.

PayTM అకౌంట్ ఉన్నవారు ఈ నంబర్ కి డయల్ చేసి, ఒక 4 డిజిట్ సీక్రెట్ కోడ్ ని పొందవలసి ఉంటుంది.ఒక్కసారి సీక్రెట్ కోడ్ పెట్టుకున్నాక, ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా సరే, ఈ నంబర్ కి కాల్ చేసి, ఏ PayTM అకౌంట్ కి అయితే డబ్బులు పంపాలో, వారి PayTM అకౌంట్ ఉన్న మొబైల్ నంబర్ టైప్ చేసి డబ్బు పంపవచ్చు.

అయితే మీ PayTM అకౌంట్లోకి డబ్బులు జమచేసుకోవడం మాత్రం ఇంటర్నెట్ మరియు యాప్ సహాయంతోనే చేసుకోవాలి.

బాన పొట్టను 20 రోజుల్లో ఫ్లాట్ గా మార్చే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!
Advertisement

తాజా వార్తలు