బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు... అదెలాగో తెలుసుకోండి..

రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లు( RuPay Credit Card ) ఇప్పుడు తమ బ్యాంక్ ఖాతాలో తగినంత డబ్బు లేకపోయినా, యూపీఐ చెల్లింపులు చేయడానికి గూగుల్ పేని ఉపయోగించవచ్చు.

ఎందుకంటే బ్యాంకులు ఇప్పుడు యూపీఐ వినియోగదారులకు క్రెడిట్ లైన్ ఫీచర్‌ను( UPI Credit Line ) అందిస్తున్నాయి.

ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి, బ్యాంక్‌తో క్రెడిట్ లైన్ కోసం సైన్ అప్ చేయాలి.అప్రూవవ్‌ తర్వాత, మీ బ్యాంక్ బ్యాలెన్స్‌తో పేమెంట్ చేసినట్లే, యూపీఐ చెల్లింపులు చేయడానికి మీ క్రెడిట్ లైన్‌ను ఉపయోగించవచ్చు.

ఆ సమయంలో మీ బ్యాంకు అకౌంట్ లో రూపాయి కూడా ఉండాల్సిన అవసరం లేదు.అయితే కస్టమర్లు గడువు తేదీకి ముందే క్రెడిట్ లైన్‌ను తిరిగి చెల్లించవలసి ఉంటుంది.

ఉపయోగించే మొత్తంపై మీ బ్యాంక్ వడ్డీని వసూలు చేయవచ్చు.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ( HDFC )ఐసీఐసీఐ బ్యాంక్( ICICI ) వంటి కొన్ని బ్యాంకులు ఇప్పటికే యూపీఐ వినియోగదారులకు క్రెడిట్ లైన్లను అందిస్తున్నాయి.

Advertisement
Now UPI Will Work Even If There Is No Money In The Account Details, UPI Credit L

ఈ సేవను యాక్టివేట్ చేయడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుసుము వసూలు చేస్తుంది, అయితే ఐసీఐసీఐ బ్యాంక్ చేయదు.రెండు బ్యాంకుల క్రెడిట్ పరిమితి రూ.50,000.

Now Upi Will Work Even If There Is No Money In The Account Details, Upi Credit L

క్రెడిట్ లైన్‌ను ఉపయోగించి యూపీఐ పేమెంట్‌( UPI Payments ) చేయడానికి యూపీఐ యాప్‌లో క్రెడిట్ లైన్ ఎంపికను ఎంచుకోవాలి.తర్వాత, చెల్లించాలనుకుంటున్న మొత్తాన్ని, యూపీఐ పిన్‌ను నమోదు చేయాలి.బ్యాంక్ ఖాతాలో తగినంత డబ్బు లేకపోయినా, లావాదేవీ ప్రాసెస్ అవుతుంది.

వ్యాపారి పేమెంట్‌ను స్వీకరిస్తారు.

Now Upi Will Work Even If There Is No Money In The Account Details, Upi Credit L

యూపీఐ క్రెడిట్ లైన్లు భారతదేశంలో వస్తు, సేవల కోసం ప్రజలు చెల్లించే విధానంలో విప్లవాత్మక మార్పులు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న కొత్త ఫీచర్.ప్రీ అప్రూవ్డ్‌ క్రెడిట్ లైన్ నుంచి ఖర్చు చేయడానికి వినియోగదారులను అనుమతించడం ద్వారా, యూపీఐ క్రెడిట్ లైన్‌లు బ్యాంక్ ఖాతాలో తగినంత డబ్బు లేకపోయినా కొనుగోళ్లు చేయడం సాధ్యపడుతుంది.అత్యవసర పరిస్థితులు లేదా ఊహించని ఖర్చులకు ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది.

ఫూల్ మఖనా తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా..?
Advertisement
" autoplay>

తాజా వార్తలు