ఇపుడు ఆధార్‌ అప్‌డేట్‌ వారికి మాత్రమే ఉచితం!

మీరు విన్నది నిజమే.తాజాగా ఆధార్‌ అప్‌డేట్‌( Aadhaar card) సేవలను ఉచితంగానే అందిస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో చెప్పుకొచ్చింది.

అయితే, ఆన్‌లైన్‌లో సొంతగా ఎవరైతే ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించింది.అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌( Andhra Pradesh )లో కొత్త జిల్లాల పేర్లతో ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా వివరించింది.

దీనికోసం యూఐడీఏఐ ప్రమాణాలకు అనుగుణంగా ధ్రువీకరణ పత్రాల జారీకి ఏర్పాట్లు చేయాలని కూడా సూచించింది.

ఆధార్ కార్డు కలిగి వున్న ప్రతి ఒక్కరూ పది సంవత్సరాలకు ఒకసారి అయినా ఆధార్‌ కార్డులోని తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని యూఐడీఏఐ ఇటీవల ఓ నిబంధన తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఎవరైతే సొంతగా ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చూసుకోవాలని భావిస్తారో వారికి ఉచితంగా సేవలు అందిస్తారు.ఆధార్‌ సెంటర్లకు వెళ్లి అప్‌డేట్‌ చేసుకునేవారు మాత్రం యథావిధిగా నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

మరోవైపు ఈ నెల 15 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు మాత్రమే ఉచిత సేవలు లభిస్తాయని యూఐడీఏఐ( UIDAI ) వేరుగా డిజిటల్‌ మీడియాలో ప్రచారం కూడా చేస్తోంది.

ఇకపోతే ఆధార్‌ కార్డు తీసుకుని పది సంవత్సరాలు గడిచినా ఒక్కసారి కూడా తమ చిరునామా, ఫొటో ధ్రువీకరణ వంటి వివరాలు అప్‌డేట్‌ చేసుకోనివారు రాష్ట్రంలో 1.56కోట్ల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.కాబట్టి కొత్త నిబంధన ప్రకారం వీరంతా తమ ఆధార్‌లో వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.

అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజులు ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తోంది.ఆధార్‌ సేవలు అందుబాటులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ నెల 20, 21, 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు