క్యాసినో కేసులో మంత్రి తలసాని కుమారుడికి నోటీసులు..!

క్యాసినో వ్యవహారం కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది.కేసు విచారణలో భాగంగా మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్ కు ఈడీ అధికారులు నోటీసులు అందించనున్నారు.

ఈ మేరకు నోటీసులు ఇచ్చేందుకు ఈడీ అధికారులు వెళ్లగా వాటిని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించినట్లు సమాచారం.దీంతో తదుపరి చర్యలపై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ కసరత్తు చేస్తోంది.కాగా ఈడీ అధికారులు వెళ్లిన సమయంలో సాయికిరణ్ ఇంటిలో లేనట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఈ కేసులో తలసాని సోదరులను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ఈ స్టార్స్ అంత ఇంజనీర్స్ అని మీకు తెలుసా..?