నథింగ్ నుంచి 2 సరికొత్త ఇయర్ బడ్స్ లాంఛ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారంతా దాదాపుగా ఇయర్ బడ్స్ ను ఉపయోగిస్తారని తెలిసిందే.

అందుకే భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో సరికొత్త ఇయర్ బడ్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే నథింగ్( Nothing ) నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి.వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలతో పాటు ధర వివరాలను తెలుసుకుందాం.

నథింగ్ ఇయర్,( Nothing Ear ) నథింగ్ ఇయర్ ఏ( Nothing Ear (a) ) అనే రెండు వేరియంట్లను నథింగ్ ఆవిష్కరించింది.ఈ రెండు ఇయర్ బడ్స్ ఆకర్షణీయమైన డిజైన్ తో లాంఛ్ అయ్యాయి.

నథింగ్ ఇయర్ బడ్స్:

ఇయర్ బడ్స్( Ear Buds ) ధర రూ.11999 గా ఉంది.ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేస్తే.రూ.10999 కే పొందవచ్చు.ఈ బడ్స్ లో 11mm డ్రైవర్స్ అమర్చారు.45DB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇంటెలిజెంట్ నాయిస్ క్యాన్సిలింగ్ సదుపాయంతో ఉంటుంది.ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 40 గంటల ప్లే బ్యాక్ టైమ్ ఇస్తుంది.కేవలం 10 నిమిషాలు చార్జింగ్ పెడితే 10 గంటలు నిరంతరం పనిచేస్తుంది.2.5 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.వైర్ లెస్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

Advertisement

ఈ బడ్స్ బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.

నథింగ్ ఇయర్ బడ్స్ ఏ:

ఈ ఇయర్ బడ్స్ ధర రూ.7999 గా ఉంది.ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేస్తే.రూ.5999 కే పొందవచ్చు.45DB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయంతో ఉంది.క్యారీ కేస్ 500mAh బ్యాటరీ, ఇయర్ బడ్స్ లో 46mAh యూనిట్ ఇచ్చారు.

ఈ ఇయర్ బడ్స్ ను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 42 గంటల ప్లే బ్యాక్ టైం ఇస్తుంది.కేవలం 10 నిమిషాలు చార్జింగ్ చేస్తే పది గంటలు నిరంతరం పనిచేస్తుంది.బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో ఉంటుంది.బ్లాక్, వైట్, ఎల్లో రంగుల్లో అందుబాటులో ఉంది.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు