నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ భారత్ లో లాంఛ్.. ధర, ఫీచర్లు ఇవే..!

నథింగ్ ఫోన్ 2ఏ( Nothing Phone 2A ) స్పెషల్ ఎడిషన్ భారత్ లో లాంఛ్ అయింది.

మే 2వ తేదీ నుంచి భారత మార్కెట్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్( Flipkart ) లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది.ఈ ఫోన్ స్పెసిఫికేషను వివరాలతో పాటు ధర వివరాలను తెలుసుకుందాం.

నథింగ్ ఫోన్ 2ఏ:

ఈ ఫోన్ 6.7 అంగుళాల AMOLED డిస్ ప్లే తో వస్తోంది.120 రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్ తో ఉంటుంది.మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది.ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ 2.5 OS తో పనిచేస్తుంది.

Nothing Phone 2a Special Edition Launched In India Price, Features Are These ,

ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 45W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.ఇక కెమెరా విషయానికి వస్తే.50 ఎంపీ మెయిన్, 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది.వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.

Nothing Phone 2a Special Edition Launched In India Price, Features Are These ,

ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23999 గా ఉంది.8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25999 గా ఉంది.12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27999 గా ఉంది.ఇక ఈ ఫోన్ పై ఉండే డిస్కౌంట్ ఆఫర్లను గమనిస్తే.

Advertisement
Nothing Phone 2A Special Edition Launched In India Price, Features Are These ,

ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.సిటీ బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10 శాతం రాయితీ పొందవచ్చు.

ఈ ఫోన్ తెలుపు, నలుపు రంగుల్లో ఉంటుందని తెలిసిందే.అయితే తాజాగా నేవీ బ్లూ రంగులో ఈ ఫోన్ ను కంపెనీ తీసుకు వచ్చింది.

భారత కస్టమర్ల కోసమే ఈ ప్రత్యేక ఎడిషన్ ను లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు