గ్రాడ్యుయేషన్ కాని వాళ్ళు బోగస్ సర్టిఫికెట్లతో వాళ్లని ఓటర్లుగా నమోదు చేస్తున్నారు....మాజీ మంత్రి కళా వెంకట్రావు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది.ఇందులో గ్రాడ్యుయేషన్ కానివాళ్ళు ఎవరుకూడ ఏజెంట్లుగా ఉండటానికి వీల్లేదు.

కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిట్లను పెట్టి వాళ్ళ ద్వారా అరాచక శక్తులును లోపల కూర్చొని పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది.గ్రాడ్యుయేషన్ కాని వాళ్ళు బోగస్ సర్టిఫికెట్లతో వాళ్లని ఓటర్లుగా నమోదు చేస్తున్నారు.

టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించి ఈఅరాచక, ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు వచ్చేలా చేయాలి.ఆటవిక ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా ఉత్తరాంధ్రా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్.

వేపాడ చిరంజీవి రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఆవశ్యకత ఓటరు మహాశయులపై ఉంది.

Advertisement

ఉత్తరాంధ్రా గ్రాడ్యుయేట్ ఓటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు తెదేపా బలపరిచిన అభ్యర్థిని అఖండ మెజారిటీ తో గెలిపించి శాసన మండలిలో ఉత్తరాంధ్రా గళం వినిపించి సీఎం జగన్ మోహన్ రెడ్డికి కనువిప్పు కలిగించాలన్నారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు