ఎవరికీ అర్థం కాని వెంకటరెడ్డి ? కాంగ్రెస్ లో ఉన్నా లేనట్టే ? 

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు సమయం ఎంతో లేదు.

టిఆర్ఎస్, బిజెపిలో పోటా పోటీగా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తుండగా,  ఎప్పటిలాగే కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు,  నాయకుల అలకలతో కాంగ్రెస్ మార్క్ రాజకీయం ఏంటో చూపిస్తోంది.

ప్రతిష్టాత్మకమైన ఈ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు సమన్వయంతో అంతా వ్యవహరించాల్సి ఉన్నా. ఇంకా నాయకులు వివిధ కారణాలు చూపిస్తూ అలక చెందుతూ ఉండడం,  ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం, పోలింగ్ తేది ముగిసే వరకు దూరంగా ఉండాలనుకోవడం, ఇలా ఎన్నో చిత్ర, విచిత్రమైన సంఘటనాన్ని తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్నాయి.

ఎన్నికలను కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వంతో పాటు, ఆ పార్టీ అగ్ర నాయకులు సీరియస్ గా తీసుకున్నారు.అంతే కాకుండా, కాంగ్రెస్ కు ఇది సిట్టింగ్ స్థానం కావడంతో, ఎలా అయినా ఇక్కడ గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు.

అయితే బిజెపి అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు,  కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా పార్టీలో మారింది.ఆయన తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ గా ఉన్నా.

Advertisement

ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.ఇక్కడ బిజెపి అభ్యర్థిగా పోటీ చేయబోయేది స్వయంగా సోదరుడు కావడంతో రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.

వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి తో పాటే వెంకటరెడ్డి బిజెపిలో చేరుతారని ప్రచారం జరిగింది.అయితే దానిపై తాజాగా వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

తన తుది శ్వాస వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటించారు.అయినా ఆయన మాత్రం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు అంత ఆసక్తి చూపించడం లేదు.

పైగా పోలింగ్ ముగిసే వరకు విదేశాలకు వెళ్లేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

మునుగోడు ఎన్నికల హడావుడి ఒకవైపు జరుగుతుండగానే,  కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా తెలంగాణలోకి అడుగుపెట్టబోతోంది .ఇంత కీలకమైన సమయంలో వెంకటరెడ్డి ఈ విధంగా వ్యవహరించడం కాంగ్రెస్ సీనియర్లకు సైతం ఆగ్రహం కలిగిస్తోంది.మొదటి నుంచి రేవంత్ కి వెంకటరెడ్డికి అంత సఖ్యత లేదు.

Advertisement

రేవంత్ వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ వెంకట్ రెడ్డి పై గతంలో చేసిన కామెంట్స్ పైన వెంకటరెడ్డి అలక చెందారు.ఆయనకు పిసిసి క్రమశిక్షణ సంఘం నోటీసులు కూడా ఇచ్చింది .దీనిపై వెంకటరెడ్డికి రేవంత్ కూడా క్షమాపణలు చెప్పారు.అయినా అప్పటి అంశాలను ప్రస్తావిస్తూ.

  ఇప్పటి ఎన్నికల ప్రచారానికి వెంకట్ రెడ్డి దూరంగా ఉండడం పై అనేక విమర్శలు పార్టీ నేతలు నుంచి వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా.లేనట్టుగానే వ్యవహరిస్తుండడం తో,  తన సోదరుడు కి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఇష్టం లేకనే వెంకటరెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని నియమించాలని గతంలో అధిష్టానం వద్ద వెంకటరెడ్డి ఒత్తిడి తీసుకువచ్చారు.

ఈ టిక్కెట్ కృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఇప్పించుకునేందుకు రేవంత్ గట్టు ప్రయత్నాలు చేసినా.వెంకట్ రెడ్డి మాట వైపే అధిష్టానం మొగ్గు చూపించడంతో పాల్వాయి స్రవంతి తరపున వెంకటరెడ్డి ప్రచారం చేస్తారని అంతా అనుకున్నారు.

ఎన్నికల ప్రచారానికి వచ్చి తన గెలుపుకు కృషి చేయాలని పాల్వాయి స్రవంతి స్వయంగా వెంకటరెడ్డి నివాసానికి వెళ్లి కోరినా.  ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉంటుండడం పై సొంత పార్టీ నాయకులే మండిపడుతున్నారట.

తాజా వార్తలు