కివి ఫ్రూట్ గురించి ఎవరికీ తెలియని.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

మనం రోజు వారిగా తీసుకునే ఆహారం మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

తాజాగా ఆహారంలో ఉపయోగించే కూరగాయలు, పండ్లకు మన రోజువారి ఆహారంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.

వీటినుంచి మన శరీరానికి చాలా పోషకాలు అందుతున్నాయి.అలాగే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా అందుతున్నాయి.

ఈ పండులో ఎన్నో ప్రత్యేక పోషకాలు ఉంటాయి.ఈ పండు తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం రోజు వారి ఆహారంలో భాగంగా పండ్లు, కూరగాయలు ఆహారంలో తింటూనే ఉంటాం.పుచ్చకాయ నుంచి అరటిపండు వరకు మనం తినేవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను మన శరీరానికి అందిస్తూ ఉంటాయి.

Advertisement

అందులో ముఖ్యమైనది కివి పండు.ఈ పండుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.దీనిలో అనేక పోషకాలు కూడా ఉన్నాయి.

వీటితో పాటు ఇందులో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది.అందుకే ఎప్పుడూ ఈ పండుకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది.

ఎక్కువగా చైనా దేశ ప్రజలు ఈ పండును బాగా తింటారు.ఇది ముఖ్యంగా నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవడానికి ఉపయోగడుతుంది.

పండులో సెరోటోనిన్ వంటి సమ్మేళనాలు ఎక్కువగా ఉన్నందున రాత్రి పూట నిద్రపోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే క్యాన్సర్ కు కారణం అయ్యే జన్యుపరమైన కారకాలను ఇది నివారిస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022

క్యాన్సర్ రావడానికి కారణమయ్యే కారకాలతో కివి పండు పోరాడుతుంది.కివి పండులో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొలెస్ట్రాల్ ను అదుపులో ఉండేలా చేస్తాయి.కివి పండ్లు కంటి సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి.

Advertisement

శరీరంలో ఉండే అనవసర టాక్సిన్లని అరికట్టేందుకు కివి పండు ఎంతగానో సహాయపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు ఒక వరం అని చెప్పవచ్చు.దీనిని తీసుకుంటే బరువు తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.దీనితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ ను రక్షిస్తుంది.ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.

రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.

తాజా వార్తలు