బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఆమేనా.. ఏం జరిగిందంటే?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 8 ( Bigg Boss Season 8 )ఇటీవల 14 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే.

చూస్తుండగానే అప్పుడే మరొక వారం ఎలిమినేషన్ దగ్గర పడింది.

గత వారం అబయ్ హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.ఇక ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ దగ్గర పడుతుండడంతో ఈవారం హౌస్ లో నుంచి ఎవరు వెళ్ళిపోతారా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

ఇకపోతే ఈ వారం హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ సోనియా( Sonia ) అని గట్టిగానే వినిపిస్తోంది.

No One Is Showing Interest In Saving Sonia Who Is In The Nominations This Week,

మొదట్లో సోనియా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ రాను రాను ఆమె మాటలు ఆమె ఆట తీరు ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు.విష్ణు ప్రియా( Vishnu Priya )సరదాగా సోనియా మీకు నిఖిల్ తో స్నేహమెలా ఏర్పడింది అని అడగగానే కస్సున విష్ణు ప్రియా పై లేచింది.బయట మా గురించి తప్పుగా పోట్రె అవుతుంది.

Advertisement
No One Is Showing Interest In Saving Sonia Who Is In The Nominations This Week,

నా పేరెంట్స్ బాధపడతారు అంటూ రెచ్చిపోయిన సోనియా ఆ తర్వాత చేసేది బుల్లితెర ప్రేక్షకులు చూస్తున్నారు.ఇక హౌస్ లో సోనియా పృథ్వి( Prithvi ) అలాగే నిఖిల్ తో చేసే వ్యవహారం గురించి మనందరికీ తెలిసిందే.

ఇద్దరికీ హగ్గు ల మీద హగ్గులు ఇస్తూ చూసే ప్రేక్షకులకు కోపం తెప్పిస్తోంది.నిఖిల్( Nikhil ), పృథ్వీ, అభయ్ లతో సోనియా ఆడుతున్న గేమ్ హౌస్ మేట్స్ లోనే కాదు బయట బుల్లితెర ప్రేక్షకుల్లోనూ సోనియా ని టార్గెట్ చేసే ఆయుధంగా మారింది.

No One Is Showing Interest In Saving Sonia Who Is In The Nominations This Week,

ఆమెని నామినేషన్స్ లో వేసే పాయింట్స్ కూడా నిఖిల్, పృథ్వీ లని ఆమె అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతుంది.అయితే అది ఆమె గేమ్ స్ట్రాటజీ అయ్యుండచ్చు.కానీ ఆమె మొదట్లో విష్ణు ప్రియతో మాట్లాడిన మాటలకు తర్వాత ఆమె చేతలకు పొంతన లేకపోవడంతో ప్రేక్షకులు ఆమెపై నమ్మకం చూపించలేకపోతున్నారు.

అందుకే ఈ వారం నామిషన్స్ లో ఉన్న సోనియా ని సేవ్ చేసునేందుకు పెద్దగా ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు.ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఎక్కువగా నబిల్ అధికశాతం ఓటింగ్ సాధిస్తున్నాడు, ఎంతెలా అంటే 40 శాతం ఓటింగ్ నబిల్ ఒక్కటే కొల్లగొడుతున్నాడు.

రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?

మొదటి నుంచి నామినేషన్స్ లో ఉండే నాగమణికంఠ రెండో స్థానంలో ఉంటూ వస్తున్నాడు.కానీ ప్రేరణ ఈసారి రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా ఆ తర్వాత ఆదిత్య ఓమ్, ఆ నెక్స్ట్ నాగమణికంఠ, పృథ్వీ లు ఉండగా చివరి డేంజర్ జోన్ లో సోనియా ఉంది.

Advertisement

గత రెండు రోజులుగా మొదలైన ఓటింగ్ లో సోనియాకి ఓట్లు పడడం లేదు.ఆ లెక్కన ఇదే ఓటింగ్ ఈ వారమంతా కొనసాగితే సోనియా ఎలిమినేట్ అవడం పక్కా అని తెలుస్తోంది.

మరి ఈ వారం హౌస్ లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.

తాజా వార్తలు