త్రివిక్రమ్‌, బన్నీలతో తేల్చేశాడు

అక్కినేని హీరో నాగార్జున తాజాగా తమిళ స్టార్‌ హీరో కార్తీతో కలిసి ‘ఊపిరి’ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఊపిరి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.

ఈ చిత్రం విడుదల అవ్వకుండానే నాగార్జున, అల్లు అర్జున్‌ల కాంబినేషన్‌లో ఒక మల్టీస్టారర్‌ సినిమా గురించి మీడియాలో వార్తలు జోరుగా రావడం మొదలైంది.త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ కాంబినేషన్‌కు దర్శకత్వం వహిస్తాడు అని, ఇప్పటికే ఆ దర్శకుడు స్టోరీ లైన్‌ను కూడా హీరోలు నాగార్జున మరియు అల్లు అర్జున్‌లతో ఓకే చేయించాడు అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే అవన్ని ఒట్టి పుకార్లే అని నాగార్జున తేల్చేశాడు.తాజాగా ‘ఊపిరి’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ బన్నీతో తాను మల్టీస్టారర్‌ చేయబోతున్నట్లుగా మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదు అని, అలాంటి ప్రపోజల్‌ ఏమీ తన వద్దకు రాలేదు అని, అసలు త్రివిక్రమ్‌తో తాను ఎలాంటి కథను డిస్కస్‌ చేయలేదు అని నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.

ఏ హీరోతో అయినా మల్టీస్టారర్‌ చేసేందుకు సిద్దం అన్న నాగార్జున ఖచ్చితంగా బన్నీతో సినిమా చేయనున్నాడు అనే ప్రచారం జరగడంతో మెగా మరియు అక్కినేని ఫ్యాన్స్‌ చాలా హ్యాపీ ఫీల్‌ అయ్యారు.కాని ఆ వార్తలు అవాస్తవం అని తెలిసి ఢీలా పడిపోయారు.

Advertisement

ముందు ముందు అయినా నాగార్జున మరియు బన్నీల కాంబోలో సినిమా రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.మరి అది భవిష్యత్తులో అయినా నెరవేరేనేమో చూడాలి.

హీరోయిన్ టబు బాలనటిగా ఎన్ని సినిమాల్లో నటించింది ఆమె అక్క కూడా తెలుగు హీరోయిన్
Advertisement