ఏ పని చేసినా ప్రశాంతత లేదా.. అయితే ఇలా చేయండి..

ప్రతి ఒక్కరి ఇంట్లో ఏవో కొన్ని రకాల సమస్యలు కచ్చితంగా ఉంటాయి.సమస్య లేని ఇల్లు అస్సలు ఉండదు.

మీ ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువగా వస్తున్నాయా, ప్రశాంతత అసలు ఉండడం లేదా, మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా.! అయితే కచ్చితంగా పండితులు చెబుతున్న ఈ పరిష్కారాలను పాటించాల్సిందే.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా అనుసరిస్తే ఏ బాధ ఉండదు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఈ నియమాలను అనుసరించడం వల్ల సమస్యలన్నిటికీ దూరంగా ఉండవచ్చు అని చెబుతున్నారు.

పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది.మన పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కొన్ని రకాల మొక్కలను మీ ఇంట్లో పెంచడం మంచిది.ఇవి మీ ఇంటి వాస్తు దోషాలను తొలగిస్తాయి.పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి వచ్చేలా చేస్తాయి.

నెగిటివ్ ఎనర్జీని ఇంటి నుంచి దూరం చేస్తాయి.మీ ఇంటి ముఖద్వారం కూడా ఎంతో ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం మంచిది.

మీ ఇంటి ముఖద్వారం ఎప్పుడూ ఉత్తరం వైపు కానీ, తూర్పు వైపు కానీ ఉండేలా చూసుకోవాలి.

ఇలా ఇంటి ముఖద్వారం ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది.అలాగే ఇంటి ముఖద్వారం బయట షూ స్టాండ్ లేదంటే జంతువుల బొమ్మల చిత్రాలు వంటివి అసలు ఉంచకండి.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

ఇక వంటగది విషయానికి వస్తే వంటగదిలో ఎప్పుడు బ్రైట్ కలర్స్ మాత్రమే ఉండాలి.బ్రైట్ కలర్స్ ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది.

Advertisement

అంతే కాకుండా బెడ్ రూమ్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.బెడ్ రూమ్ లో నిద్రపోయేటప్పుడు మీ మంచం దక్షిణాదిశలో కానీ, పడమర దిశలో కానీ ఉండేలా చూసుకోవడం మంచిది.

తాజా వార్తలు