సమంత-వరుణ్ మధ్య ఇంటిమేట్ సీన్స్.. క్లారిటీ ఇచ్చిన సిటాడెల్ మేకర్స్!

స్టార్ హీరోయిన్ లలో సమంత( Samantha ) రూత్ ప్రభు ఒకరు.ఈమె సౌత్ లో స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది.

ఇక పెళ్లి తర్వాత ఆచితూచి సినిమాలు చేసిన సమంత విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం అమ్మడి జోరు బాగా పెరిగింది.ఇంతకు ముందులా వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ పోతుంది.

పుష్ప ఐటెం సాంగ్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యిన ఈమెకు ఆ తర్వాత మరిన్ని అవకాశాలు వరించాయి.బాలీవుడ్( Bollywod ) లో కూడా బడా ప్రాజెక్ట్స్ పై సైన్ చేసింది.

అయితే వరుస అవకాశాలు అందుకుంటూన్న సమయంలోనే హెల్త్ ప్రాబ్లెమ్ బారిన పడి ఇప్పుడిప్పుడే దీని నుండి కోలుకుంటుంది.ఈ మధ్యనే షూట్ లలో పాల్గొంటూ మెల్లగా తన వృత్తి జీవితంలోకి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది.

Advertisement

ప్రెజెంట్ సామ్ సిటాడెల్( Citadel ) వెబ్ సిరీస్ తో పాటు తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమా కూడా చేస్తుంది.ఈ రెండు ప్రాజెక్టుల షూటింగ్ లో సమంత పాల్గొంటుంది.ఇదిలా ఉండగా ఈమె చేస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ నుండి పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ వర్షన్ రిలీజ్ అయినప్పటి నుండి ఇందులోని ఇంటిమేట్ సీన్స్ లో సామ్ కూడా అలాగే చేయబోతుందా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

మరీ ముఖ్యంగా గత రెండు రోజులుగా సమంత, వరుణ్ ధావన్ మధ్య ఇంటిమేట్ సీన్స్ ఉండబోతున్నాయి అని బాలీవుడ్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతుండగా వీటికి క్లారిటీ ఇచ్చారు మేకర్స్.ఇలాంటి సీన్స్ ఏమీ ఉండవని టీమ్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది.ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే లు డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్, సమంత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇంటర్నేషనల్ సిరీస్ సిటాడెల్ లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్రనే ఇక్కడ సామ్ పోషిస్తుంది.ఇక ఈ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime Video ) వారు రిలీజ్ చేస్తున్నారు.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతున్న ఈ సిరీస్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.చూడాలి సమంతకు ఈ డైరెక్టర్లు అయిన హిట్స్ ఇస్తారో లేదో.

Advertisement

తాజా వార్తలు