బాహుబలిలో నితిన్... ఎక్స్‌ట్రా ఆర్డినరీ జూనియర్ ఆర్టిస్ట్‌

నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్‌ గా వక్కంతం వంశీ( Vakkantam Vamsi ) దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ( Extra ordinary ).

ఈ సినిమా టీజర్ ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు సంబంధించిన టీజర్ ను విడుదల చేస్తాం అన్న టైమ్ కు కాస్త లేట్ గా విడుదల చేయడం జరిగింది.అయినా కూడా సినిమా పై అంచనాలు పెంచడం లో ఈ టీజర్ విజయం సాధించింది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నితిన్( Nitin ) ను ఈ సినిమా లో జూనియర్ ఆర్టిస్ట్‌ గా చూడబోతున్నాం.బాహుబలి సినిమా లో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌ గా నటించాడు అంటూ చూపించేందుకు బాహుబలి షాట్స్ వేడయం తో ఆర్డినరీ టీజర్ కాస్త ఎక్ట్రార్డినరీగా మారిపోయింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నితిన్‌ ను కొత్త యాంగిల్ లో చూడబోతున్నాం అనిపిస్తుంది.అంతే కాకుండా దర్శకుడు వక్కంతం వంశీ ఈ సినిమా తో దర్శకుడిగా మంచి పేరును దక్కించుకుంటాడు అని కూడా అనిపిస్తోంది.మొత్తానికి నితిన్ కి మరియు వక్కంతం కు ఎంతో కీలకం అయిన ఈ సినిమా మొదటి టీజర్ తోనే పాజిటివ్ మార్కులు దక్కించుకుంది.

Advertisement

ముందు ముందు ఈ సినిమాకు మంచి స్పందన లభించే అవకాశాలు ఉన్నాయి.ఈ సినిమా లో శ్రీ లీల నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి అనడం లో సందేహం లేదు.

ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ అవ్వడం లో సందేహం లేదు.అందుకే ఈ సినిమా లో ఆమె నటించడం వల్ల సినిమా స్థాయి పెరగడం ఖాయం అంటూ మొదటి నుంచి కూడా ప్రచారం జరుగుతోంది.

అన్నట్లుగానే ఈ సినిమా లో ఆమె ఎక్స్‌ట్రా అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు