ప్రభాస్ విషయం లో నా అమాయకత్వం తో మీడియా ఆడుకుంది : నిత్య మీనన్

నిత్యా మీనన్( Nithya Menon ) తమిళం, మలయాళం భాషల్లో మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

"అలా మొదలైంది (2011)" సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఆ సినిమాలో చూపించిన నటనకు అందరూ ఫిదా అయిపోయారు.అంతేకాదు ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డు కూడా లభించింది.

ఇష్క్ సినిమాతో చాలామందికి డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన అలరించింది.

అయితే ఈ ముద్దుగుమ్మ తనకు ప్రభాస్ ఎవరో తెలియదంటూ ఒకానొక సందర్భంలో మాట జారింది.దీనివల్ల ఆమె పెద్ద కాంట్రవర్సీలో చిక్కుకుంది ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఆమెపై విరుచుకుపడ్డారు.

Advertisement

అయితే నిత్యామీనన్ ఒక తెలుగు ఛానెల్ ఇంటర్వ్యూలో తనకు ప్రభాస్( Prabhas ) ఎందుకు తెలియదని చెప్పానో తెలిపింది.నిత్యామీనన్ మాట్లాడుతూ "నేను ఎక్కువగా ఫిలిమ్స్ చూడను.తమిళ, కన్నడ సినిమాలు కూడా ఎక్కువగా చూసే అలవాటు లేదు నాకు.

అప్పట్లో తెలుగు భాష రాకపోయేది.అందువల్ల తెలుగు సినిమాలు కూడా చూసేది కాదు.

అప్పటికి జస్ట్ "అలా మొదలైంది" సినిమా ఒక్కటే చేశాను.ఆ సమయానికి నాకు చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, వెంకటేష్ ( Chiranjeevi, Nagarjuna, Allu Arjun, Venkatesh )లాంటి హీరోలు మాత్రమే తెలుసు.

మలయాళ ఇండస్ట్రీలో వాళ్ల పేర్లు వినిపించాయి కాబట్టే వారి గురించి నాకు తెలిసింది.వారికి మించి నాకు హీరోలు ఎవరూ తెలియదు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

ఆ సమయంలో ఒకరు "ప్రభాస్" పేరును మెన్షన్ చేస్తూ ప్రశ్న వేశారు.నాకు నిజంగానే తెలియదు కాబట్టి ఎవరు, ఏంటి? అని నార్మల్గానే క్వశ్చన్ చేశాను.ఆ ఆన్సర్ చెప్పినప్పుడు నా ఫేస్ చూస్తే నాకు అతను ఎవరో నిజంగానే తెలియదు అనేది తెలుస్తుంది.

Advertisement

కానీ వాళ్లు నేను కావాలనే ప్రభాస్ ఎవరో తెలియదని చెప్పినట్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు.అది నన్ను బాగా హర్ట్ చేసింది." అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.

" "హూ, "వాట్" అనే రెండు ప్రశ్నలు వేయగానే జర్నలిస్టులకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ దొరికేసింది.అంతే వాళ్లకి నచ్చినట్లు నా గురించి రాసేసారు.నన్ను మోసం చేశారు.

నమ్మకద్రోహానికి గురైనట్లు నేను ఫీల్ అయ్యా.ఆ తర్వాత నేను ఏ ప్రశ్నకు కూడా నా మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకి చెప్పలేకపోయా.

హానెస్టీగా ఉంటే వాళ్లు నన్ను చీట్ చేశారు.నా హానెస్టీకి వాళ్లు డిజర్వ్‌ కాదనిపించింది.

అందుకే వారితో ఎప్పుడూ నిజాయితీగా లేను.నాకు నచ్చిన వారితోనే హానెస్టీగా నేనుంటాను" అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు