ఈరోజు తాను ఎప్పటినుంచో కంటున్న కల నిజమైందని, క్రీడల్లో పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా గుర్తింపు రావాలని తాను ఎప్పటినుంచో కోరుకుంటున్నాను అని, ఈరోజు స్త్రీ క్రీడాకారిని లు ఆడుతుంటే ప్రేక్షకులు ఆడ మగ తేడా లేకుండా చప్పట్లు కొట్టుతూ అభినందిస్తున్నారని ఇది చాలా ఆనందించాల్సిన విషయం అని ఆవిడ తెలిపారు.
ఉమెన్స్ ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలను ఇప్పట్లో మర్చిపోనని తెలిపిన ఆమె మహిళా క్రీడా ప్రపంచంలో ఇదొక మైలు రాయి లాంటి రోజని, ఇటువంటి కార్యక్రమంలో తాను భాగస్వామిని కావడం చాలా గర్వంగా ఉందని తెలిపారు.
డబ్ల్యు పి ఎల్ తొలి రోజు గేమ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయిoట్స్ పై ముంబై ఇండియన్స్ జట్టు 146 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.అనంతరండ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన సెలబ్రేషన్స్లోలో ఆమె పాల్గొన్నారు.
ఈ డబ్ల్యూ పి ఎల్ ఎంతోమంది మహిళలకు ప్రేరణగా నిలుస్తుందని, తాము కూడా క్రీడల్ని కెరియర్గా ఎన్నుకోవచ్చు అనే ధైర్యాన్ని స్త్రీలకు ఇస్తుందని ,స్త్రీ సాధికారతకు ఇది గొప్ప మలుపని ఆమె కొనియాడారు ఈ సందర్భంగా ఘనవిజయం సాధించిన తమ జట్టు సభ్యులను ఆమె అభినందించారు , కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెగువ తనను ఆశ్చర్యపరచిందన్న నీతా అంబానీ, 45 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన అమేలియా కౌర్ ప్రతిభను కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచిన మహిళా జట్టు, పురుషుల జట్టుకు ఏ మాత్రం తీసిపోదని మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
మొదటినుంచి క్రికెట్ పట్ల ఆసక్తితో ఉండే నీతా అంబానీ ముంబై ఇండియన్స్ పురుషుల జట్టును కూడా చాలాసార్లు మైదానం నుంచి ప్రోత్సహిస్తూ కనిపించారు.పురుషుల ఉమెన్స్ ప్రీమియం లీగ్ లో ఒక జట్టును కొనాలన్న నిర్ణయం కూడా ఆమెదే అని, ఇకపై ముంబై ఇండియన్స్ ఉమెన్స్ లీగ్ లో జరిగే మ్యాచ్ లకు ఆమె తరచూ హాజరయ్యి తమ జట్టును ప్రోత్సహిస్తారని ముంబై ఇండియన్స్ వర్గాలు తెలిపాయి .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy