Nirai Mata Temple : సంవత్సరానికి ఐదు గంటలు మాత్రమే తెరిచి ఉండే ఆలయం.. ఈ గుడిలోకి మహిళలకు ప్రవేశం లేదు..!

మన దేశ వ్యాప్తంగా ఎన్నో పురాతనమైన ఆలయాలు( Ancient Temples ) ఉన్నాయి.ఈ దేవాలయాలకు ప్రతిరోజు భక్తులు వెళ్లి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.

ఈ ఆలయాలు కొన్ని ముఖ్యమైన గ్రహణాలకు కొన్ని గంటలు మూసివేస్తుంటారు.కానీ సంవత్సరానికి 5 గంటలు మాత్రమే తెరిచి ఉండే దేవాలయం గురించి చాలా మందికి తెలిసి ఉండదు.

ఈ ఆలయం కూడా శబరిమల, చార్ధామ్ లాంటి దేవాలయాలకు చెందిన దేవాలయమే.అయితే ఈ ఆలయం మాత్రం సంవత్సరంలో ఐదు గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది.

ఐదు గంటల తర్వాత దేవాలయం తలుపులను అక్కడి అర్చకులు మూసివేస్తారు.మళ్ళీ అమ్మవారి దర్శనం కావాలంటే ఏడాది వరకు వేచి ఉండాల్సిందే.

Advertisement
Nirai Mata Mandir Open Only For 5 Hours In A Year Nirai Mata Mandir Open Only F

అదే నీరై మాత ఆలయం.ఈ ఆలయం చత్తీస్గడ్ లోని గారి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పై ఉంది.

నిరాయ్ మాత దేవాలయం( Nirai Mata Temple )లోని వెళ్లాలంటే కేవలం చైత్ర నవరాత్రి అంటే ఉగాది ఉత్సవాల సమయంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఉదయం 9 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం వీలు ఉంటుంది.

Nirai Mata Mandir Open Only For 5 Hours In A Year Nirai Mata Mandir Open Only F

ఆ రోజు ఐదు గంటలకు దేవాలయానికి( Five Hours Temple ) వేల సంఖ్యలో భక్తులు వస్తారు.అలాగే ఈ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు.సాధారణంగా అన్ని దేవాలయాల్లో అర్చకులు ఉపయోగించే కుంకుమ, తేనే, అలంకరణ వస్తువులేవి ఇక్కడ ఎప్పుడూ ఏ కార్యక్రమానికి ఉపయోగించరు.

కేవలం కొబ్బరికాయ కొట్టి అగరవత్తులు వెలిగిస్తే చాలు అమ్మకి పూజ చేసినట్లే అని అర్చకులు చెబుతున్నారు.ఆ 5 గంటల తర్వాత భక్తులను దేవాలయంలోకి అసలు అనుమతించరు.

Nirai Mata Mandir Open Only For 5 Hours In A Year Nirai Mata Mandir Open Only F
పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?

అలాగే మళ్ళీ చైత్ర నవరాత్రి( Chaitra Navaratri ) వరకు ఆలయంలోకి ఎవరూ రాకూడదని నిబంధన కూడా ఉంది.అంతేకాకుండా ఈ దేవాలయంలోకి మహిళల ప్రవేశం కూడా నిషేధించబడింది.ఆ నిషిద్ధం ప్రవేశం వరకు మాత్రమే కాదు చివరికి అమ్మవారి ప్రసాదం కూడా మహిళలు తినకూడదు.

Advertisement

కాదు కూడదు అని తింటే జీవితంలో ఏదో చెడు జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.నీరయ్ మాత దేవాలయంలో దీపం దానికదే వెలుగుతుందట.నూనె లేకుండా తొమ్మిది రోజులపాటు ఆ దీపం అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

అది ఎలా వెలుగుతుందో ఇప్పటికీ ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు.

తాజా వార్తలు