తనని తొలగించడంపై హైకోర్టుని ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగించిన సంగతి తెలిసిందే.

ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఏదో కక్ష సాధింపు చర్యగానే జగన్ ఇలా ఎన్నికల కమిషనర్ ని తొలగించారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు తనని తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ హైకోర్టుకి వెళ్ళారు.

తాను నిష్పక్షపాతంగా పని చేస్తుంటే, ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని, వైసీపీ నేతలపై ఫిర్యాదులు రాగా, తాను నివేదికలు కోరడమే తప్పైందని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆరోపించారు.తనను తొలగించేందుకు ఆర్డినెన్స్ తీసుకుని రావడాన్ని హైకోర్టులో సవాల్ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెంటనే జీవోపై స్టే విధించాలని కోరారు.

తాను స్థానిక ఎన్నికలను వాయిదా వేయకుంటే, ఏపీ ఈపాటికి కరోనా హాట్ స్పాట్ గా మారి ఉండేదని, అయితే, ఎన్నికలు వాయిదా వేయాలని తాను తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి, తనకు మధ్య ఘర్షణ జరిగిందని ఆయన వివరించారు.కేవలం తాను తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించలేక ఏపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా తనని తొలగించే విధంగా నిబంధనలు మార్పు చేస్తూ జీవో చేసిందని ఆరోపించారు.

Advertisement

దీనిపై విచారణ జరపాలని హైకోర్టులో ఆయన ఎమర్జెన్సీ పిటిషన్ వేశారు.అత్యవసర సమయాల్లో మాత్రమే ఆర్డినెన్స్ లను తేవాలని, అది కూడా న్యాయ సమీక్షకు లోబడివుండాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, ఏపీలో అలాంటి పరిస్థితి లేకున్నా, తనను తప్పించాలన్న ఉద్దేశంతోనే జీవో తెచ్చారని ఆయన ఆరోపించారు.

ఇక ఈ పిటీషన్ ని హైకోర్టు విచారణకి స్వీకరించింది.మరి దీనిపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఎలాంటి హెచ్చరికలు చేస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు