థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న నిఖిల్ 'స్పై' ట్రైలర్.. మరో హిట్ ఖాయమా?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్( Nikhil Siddharth ) ఒకరు.ఈయన ప్రత్యేక పరిచయం లేని పాన్ ఇండియన్ హీరో.

సాధారణ హీరో నుండి పాన్ ఇండియా హీరోగా అవతరించేందుకు నిఖిల్ శ్రమ అంతా ఇంతా కాదు.నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని సృష్టించిన సంచలనం అందరికి తెలిసిందే.

ఎలాంటి ఆర్బాటం లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

కార్తికేయ 2 సినిమా తర్వాత వెంటనే మళ్ళీ 18 పేజెస్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇలా వరుసగా రెండు హిట్స్ అందుకుని యంగ్ హీరోల్లోనే తిరుగులేని సక్సెస్ ట్రాక్ ను మైంటైన్ చేస్తున్నాడు.ప్రస్తుతం నిఖిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పై.

Advertisement

( Spy Movie ) యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.ఇటీవలే టీజర్ తో పాటు ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయగా ఈ థ్రిల్లింగ్ కలిగించే సినిమాపై ప్రేక్షకుల ద్రుష్టి పడింది.

ఇక నిన్న ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.స్పై ట్రైలర్( Spy Movie Trailer ( థ్రిల్లింగ్ అంశాలతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

చరిత్ర మనకు ఎప్పుడు నిజం చెప్పదు దాస్తోంది దానికి సమాధానం మనమే వెతకాలి అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో స్పై ట్రైలర్ మొదలయ్యింది.

యాక్షన్ థ్రిల్లింగ్, ఫైట్స్ వంటి అంశాలు ఈ సినిమా ట్రైలర్ ను బాగా ఎలివేట్ చేసి ఆసక్తిని పెంచేసాయి.ఇక ప్రత్యేక పాత్రలో రానా( Rana Daggubati ) నటించగా ఈయన చెప్పే పవర్ఫుల్ డైలాగ్ తో ఈ ట్రైలర్ ముగుస్తుంది.ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించడమే కాకుండా కథ కూడా అందించారు.ఇక ఆర్యన్ రాజేష్( Aryan Rajesh ) కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Advertisement

ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా జూన్ 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.మరి ఈ సినిమాతో నిఖిల్ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

తాజా వార్తలు