18 పేజెస్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 18 పేజెస్.

నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందిని.

ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు, సుకుమార్ ఈ సినిమాను నిర్మించారు.గోపి సుందర్ సంగీతాన్ని అందించాడు.

ఏ వసంత్  సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

పైగా ఈమధ్య వరుస సక్సెస్ లతో దూసుకొస్తున్న నిఖిల్ కు ఈ సినిమా ఇంకెంత సక్సెస్ అందించిందో చూద్దాం.

కథ:

కథ విషయానికొస్తే ఈ సినిమా మొత్తం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చుట్టూ తిరుగుతుంది.అనుపమ ఇందులో నందిని పాత్రలో కనిపిస్తుంది.

Advertisement
Nikhil Siddharth Anupama Parameswaran 18 Pages Movie Review And Rating Details,

అయితే ఈమె ఫోన్ కు చాలా దూరంగా ఉంటుంది.నిజానికి ఆమె ఫోన్ వాడదు.

ఇక నిఖిల్ ఈమెతో ప్రేమలో పడతాడు.అయితే ఆ సమయంలో ఈమె జ్ఞాపకశక్తి కోల్పోయే అరుదైన వ్యాధితో బాధపడుతుంది అని నిఖిల్ తెలుసుకుంటాడు.

Nikhil Siddharth Anupama Parameswaran 18 Pages Movie Review And Rating Details,

నందిని కూడా తను కొన్ని రోజులలో జ్ఞాపకశక్తి కోల్పోతాను అని  గ్రహించినప్పుడు చేసే పనులన్నీ డైరీలో రాసుకోవడం ప్రారంభిస్తుంది.ఆ డైరీ లో ఆమె 18వ పేజీలో ఉండగా ఆమె కిడ్నాప్ కు గురవుతుంది.కాకుండా ఆ సమయంలో జ్ఞాపక శక్తి కూడా కోల్పోతుంది.

అక్కడే ట్విస్టు అనేది మొదలవుతుంది.ఆ తర్వాత నిఖిల్ తనను ఎలా కలుస్తాడు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

డైరీ ఎలా దొరుకుతుంది.  చివరికి ఆమెకు గుర్తుకొస్తుందా లేదా అనేది మిగిలిన కథలోనిది.

Advertisement

నటినటుల నటన:

నటుల నటన విషయానికి వస్తే.నిఖిల్ పాత్ర బాగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో సహజంగానే అనిపించింది.నందిని పాత్రలో అనుపమ మాత్రం అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు.

మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే.డైరెక్టర్ మంచి ప్రేమ కథను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.ఇక గోపి సుందర్ అందించిన పాటలు బాగా ఆకట్టుకున్నాయి.

బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మరింత జాగ్రత్త పడితే బాగుండేది.సినిమాటోగ్రఫీ కూడా పరవాలేదు అన్నట్లుగా ఉంది.

విశ్లేషణ:

ఇక ఈ సినిమా మెయిన్ క్యారెక్టర్స్ తో ప్రారంభమై మధ్యలోకి వెళ్లాక బాగా ఆసక్తిగా మారుతుంది.ప్రేక్షకులను కథలోకి లీనమయ్యేలా చేస్తుంది.

ఇక ట్విస్టులు కూడా  అద్భుతంగా చూపించారు.సెకండ్ హాఫ్ లో కూడా బాగా థ్రిల్లర్ మూడ్లోకి వెళ్లిపోవచ్చు.

చాలావరకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:

సినిమా కథ, స్క్రీన్ పే అద్భుతంగా ఉంది, కొన్ని ట్విస్టులు బాగా ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఎమోషనల్ ఉంటే మరింత బాగుండేది.అక్కడక్కడ కాస్త సాగదీసినట్లు అనిపించింది.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే ఇది ఒక మంచి ప్రేమ కథ అని చెప్పవచ్చు.అంతేకాకుండా సస్పెన్స్ తో కూడి ఉన్న ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

రేటింగ్: 2/5

తాజా వార్తలు