ఎన్టీఆర్ తో నిహారిక డ్రీమ్..!

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన నిహారిక ఒక మనసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా సినిమాలో నిహారిక నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.

సంధ్య పాత్రలో చక్కగా ఒదిగిపోయిన నిహారికను అందరు మెచ్చుకుంటున్నారు.ఇక మొదటి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కొత్త ప్రయత్నం చేసి అలరించిన ఈ అమ్మడు తనకు నందమూరి హీరోతో నటించాలని ఉందంటుంది.

స్టార్ హీరోల్లో మాన్లీ స్టార్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు చాలా పెద్ద అభిమాన గళమే ఉంది.అయితే అందులో స్టార్స్ కూడా ఉంటారు.

ఆ క్రమంలోనే ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమున్న మెగా డాటర్ నిహారిక తనకు జూనియర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కలలు కంటుందట.మరి దానికి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా మరి.ఇప్పటికే ఒక మనసు సినిమాలో నాగ శౌర్యతో ముద్దు సీన్స్ నటించిందని మెగా అభిమానులు కాస్త అసహనంగా ఉన్నారు.అయితే ఒక మనసు సినిమాలో సంధ్యలా తనను చూడాలి తప్ప బయట ఉన్న ఇమేజ్ ను కాదు అని సమర్ధించుకుంటుంది నిహారిక.

Advertisement

మరి అమ్మడి కల నెరవేరుతుందో లేదో చూద్దాం.

నేను జిమ్ చేసేది బరువు తగ్గడం కోసం కాదు..నన్ను అలా చూడలేరు : ప్రగతి
Advertisement